ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: జాతీయస్థాయి అవార్డు సాధించిన ఏజెన్సీ గ్రామం

ABN, First Publish Date - 2023-06-17T18:44:39+05:30

జల సంరక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం: జల సంరక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ 11 కేటగిరీల్లో 41విజేతలను ప్రకటించగా జలసంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం ఎంపికైంది. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ ఆధ్వర్యంలో 2018నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు. డిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లీనరీ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జగన్నాథపురం సర్పంచ్‌ గడ్డం భవాని, కార్యదర్శి షేక్‌ ఇబ్రహీంలు ఉపరాష్ట్ర పతి జగదీప్‌ దంఖర్‌ చేతుల మీదుగా ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, నగదు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ మాట్లాడుతూ మరోసారి భద్రాద్రి జిల్లా జాతీయ స్థాయిలో జలసరక్షణలో మొదటిస్థానం సాధించడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాగానికి, సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా నిలిపారని కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-17T18:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising