ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఔటర్‌ రింగురోడ్డు బయట కొత్త పారిశ్రామికవాడలు!

ABN, Publish Date - Dec 19 , 2023 | 03:24 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల కొత్తగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ కాలుష్యంతో, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా ఈ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

సాగుకు యోగ్యంకాని భూములనే సేకరించాలి

ఓఆర్‌ఆర్‌కు వెలుపల.. ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల ఉండాలి

కాలుష్యరహిత పరిశ్రమలకే ప్రాధాన్యమివ్వాలి

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

పారిశ్రామికాభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష

500-1000 ఎకరాలను గుర్తించాలి

సాగులో లేని భూములే సేకరించాలి

అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల కొత్తగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ కాలుష్యంతో, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా ఈ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నూతన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు బయట, ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ భూములు విమానాశ్రయం, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50-100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సోమవారం ఆయన సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్‌ మాట్లాడుతూ.. పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండాలన్నారు. సాగుకు యోగ్యం కానివే ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు నష్టం కలగదన్నారు. నూతన పారిశ్రామికవాడల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు.

వినియోగించని భూముల వివరాలివ్వండి..

ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. కేటాయించిన భూములను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉంచితే, ఆ వివరాలనూ అందజేయాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్దఎత్తున భూములను కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్‌ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్యప్రాచ్య, యూరోపియన్‌ దేశాల్లో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములు గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆయా భూముల ధరలు తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులూ సహకరిస్తారన్నారు. పరిశ్రమలకు థర్మల్‌ విద్యుత్తు బదులు సౌర విద్యుత్తు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని ఊర్లను మోడల్‌ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సందర్భంగా బాలానగర్‌లోని ఐడీపీఎల్‌ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Dec 19 , 2023 | 03:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising