ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోగస్‌ ఓట్ల నమోదుకు యత్నం

ABN, First Publish Date - 2023-09-04T01:16:42+05:30

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లను చేర్చేందుకు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకు న్నారు.

ఏజెన్సీ ప్రతినిధులను ఎంఆర్‌వోకు అప్పగించిన కాంగ్రెస్‌ నాయకులు

ఇతర నియోజకవర్గం ఓట్లను నిజామాబాద్‌ అర్బన్‌లో చేర్చేందుకు యత్నం

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 3: నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లను చేర్చేందుకు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకు న్నారు. ఆదివారం నగరంలోని మాలపల్లి, ముజాహిద్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉన్న పీలా పాఠశాలలో లెగ్‌టెక్‌ ఏజెన్సీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన ఓట్లను నిజామాబాద్‌లోని మైనార్టీ ఏరియాలో ఉన్న కొన్ని ఇండ్ల నెంబర్ల పేరుతో పాతవారి ఫొటోలను తొలగించి కొత్త ఫొటోలను పెడుతూ ఓటర్లను చేర్చే ప్ర యత్నం చేయగా కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన ఓటర్లను నిజామాబాద్‌ అర్బన్‌లో చేర్చుతున్న హర్యానాకు చెందిన లెగ్‌టెక్‌ కంపెనీకి చెందిన శ్రీనివాస్‌, కృష్ణ, షబానా అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకొని సౌత్‌ ఎంఆర్‌వో కార్యాల యానికి తీసుకువచ్చారు. సౌత్‌ ఎంఆర్‌వో బాలరాజు ఓట ర్ల నమోదు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి వివరాల ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రతినిధులు రాకేశ్‌ అనే వ్యక్తితో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడి ఎంఆర్‌వో కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కాగా, వారిపై ఎంఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సదరు ఏజెన్సీ ప్రతినిధులు రాకేశ్‌ అనే వ్యక్తి తమతో ఈ పనిచే యిస్తున్నారని చెబుతుండగా నగరంలోని ప్రజాప్రతినిధి తమ్ముడి పేరు సైతం అదే కావడంతో అతనే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. బోగస్‌ ఓట్ల విషయమై ఇదివరకే నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఐపై ఎంఐఎం నాయకులు ఆరోపణలు చేయగా ఆయనను బోధన్‌కు బదిలీ చేశారు. గత ఎన్నికల్లో బోగస్‌ ఓట్ల తయారీలో ఆర్‌ఐ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సైతం భారీగా బోగస్‌ ఓట్లను అర్బన్‌లో నమోదు చేయాలని కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-09-04T01:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising