బాన్సువాడను మరింత అభివృద్ధి చేస్తా..
ABN, First Publish Date - 2023-08-17T23:35:03+05:30
బాన్సువాడ మున్సిపాలిటీ పరిఽధిలోని కల్కి చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మల్టీ జనరేషన్ పార్క్ పనులను గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి మినీట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దఫేదార్ రాజు, నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులు, బాన్సువాడ నాయకులు, తదితరులు ఉన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 17: బాన్సువాడ మున్సిపాలిటీ పరిఽధిలోని కల్కి చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మల్టీ జనరేషన్ పార్క్ పనులను గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి మినీట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దఫేదార్ రాజు, నిజాంసాగర్ మండల ప్రజా ప్రతినిధులు, బాన్సువాడ నాయకులు, తదితరులు ఉన్నారు.
అంబులెన్స్ వాహనాల ప్రారంభం
బాన్సువాడ మున్సిపాలిటీ, గ్రామీణ మండలానికి మంజూరు చేసిన రెండు 108 అంబులెన్స్ వాహనాలు, బీర్కూర్ మండలానికి కేటాయించిన 102 వాహనాన్ని గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులను ఆస్పత్రులకు తరలించడంలో అంబులెన్స్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్యారోగ్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-08-17T23:35:03+05:30 IST