ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసెంబ్లీ ఎన్నికలపై బీసీ నేతల దృష్టి

ABN, First Publish Date - 2023-08-17T01:25:16+05:30

ఉమ్మడి జిల్లాలో బీసీ నేతలు వచ్చే ఎన్నికలు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా తాము ఉన్న పార్టీల నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

జిల్లాలో ఎవరికి వారే ఎన్నికల్లో పోటీకి ప్రయత్నాలు

కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న అనేక మంది నేతలు

నిజామాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో బీసీ నేతలు వచ్చే ఎన్నికలు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా తాము ఉన్న పార్టీల నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. తాము పని చేస్తున్న పార్టీల అగ్రనాయకత్వాన్ని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేం దుకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ తాము పనిచేస్తున్న పార్టీల నుంచి టికెట్‌ రాకుంటే ఇతర పార్టీల నుంచి పోటీ కోసం ప్రయ త్నాలు కొనసాగిస్తున్నారు. అన్ని పార్టీలో ఉన్న బీసీ నేతలు పోటీ కోసం గట్టి ప్రయత్నాలను చేస్తున్నా రు. తాము ఉన్న కుల సంఘాల ద్వారా కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సమీపిస్తున్న గడువు

వచ్చే శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల కోసం అక్టోబరు చివరన కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించనుంది. నవంబరు లేదా డిసెంబరు నెలలో పోలింగ్‌ నిర్వ హించనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఓటరు లిస్టుతో పాటు ఇతర ఏర్పాట్లను కొనసాగిస్తోంది. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్‌ బూతులకు అనుకూలంగా ఈవీఎంలు, ఇతర వస్తువులను కావాల్సినవి సమకూరుస్తున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. షెడ్యూల్‌కు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు కావాల్సిన నిధులను సమకూరుస్తున్నారు.

పోటీ కోసం తీవ్ర యత్నం

ఉమ్మడి జిల్లా పరిధిలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌లే పోటీ పడను న్నారు. మొత్తం 9 నియోజకవర్గాల పరిధిలో వారు ఇప్పటికే పోటీకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలన్నింటినీ ప్రజలకు అందే విధంగా చేయడంతో పాటు కొత్త పథకాలకు శంకుస్థాపన చేస్తున్నారు. అన్ని సంఘాలకు నిధులు విడుదల చేస్తూ అనుమతి పత్రాలను ఇస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ క్యాడర్‌ చేజారకుండా చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌, బీజేపీలో ఉన్న బీసీ నేతలంతా ఈ దఫా ఎలాగైనా పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండటం వల్ల ఈ దఫా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతు న్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కనీసం మూడు సీట్లకు తగ్గకుండా బీసీలకు ప్రాతి నిధ్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయా పార్టీలో పనిచేస్తున్న నేతలు టికెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గ పరిధిలో పనిచేస్తూనే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను కలుస్తూ ఆయా నియో జకవర్గాల్లో బీసీల జనాభా ఎంత ఉంది, సామాజిక వర్గ జనాభా ఎంత ఉంది, ఎన్ని రోజుల నుంచి పార్టీ కోసం పనిచేస్తు న్నారు వివరించడంతో పాటు తగిన అవకాశం ఈ ఎన్నికల్లో ఇవ్వాలని కోరుతున్నారు.

నాలుగు సీట్లలో పోటీకి కసరత్తు

ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్‌లో ఇద్దరు ఎమ్మె ల్యేలు ఉండగా కాంగ్రెస్‌, బీజేపీ నుంచి మాత్రం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఈ దఫా ఎలా గైనా సీటు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. కాంగ్రెస్‌, బీజేపీలో సర్వేల ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని ప్రకటిస్తున్న ఆయా నియోజక వర్గాల పరిధిలో తమ సామాజిక వర్గం నేతల ద్వారా సమావేశాలను నిర్వహిస్తూ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎలాగైనా ఉమ్మడి జిల్లా పరిధి లోని అన్ని నియోజకవర్గాల్లో కనీసం 4 సీట్లలో బీసీ లు పోటీ పడే విధంగా ప్రయత్నాలను కొనసాగి స్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1 రిజర్వేషన్‌ ఉండగా, మిగతా 8 సీట్లు జనరల్‌గా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధి లోని ఆయా పార్టీల నేతలు ఈ ప్రయత్నాలను జోరుగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అధిష్టానాలు సర్వేల ద్వారా బలమైన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తూ తాము కూడా ఈ రెండు పార్టీలు మినహా ఇతర పార్టీల నుంచి టికెట్‌ తీసుకొని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దఫా పోటీ చేస్తే గెలవకున్నా వచ్చేసారి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఎలాగైనా సీట్లు తెచ్చుకొనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొంత మంది బీసీ నేతలు ఎంత ఖర్చు అయినా పెట్టుకు నేందుకు సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీస్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు గెలుపు గుర్రాలపై దృష్టిపెట్టడం వల్ల ఎవరికి సీట్లు వస్తాయో చెప్పే పరిస్థితి లేదని ఉమ్మడి జిల్లా పరిధిలోని కొంతమంది బీసీ నేతలు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-08-17T01:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising