ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెలల వ్యవధిలోనే పిల్లల మృతిపై వివరాల సేకరణ

ABN, First Publish Date - 2023-08-24T00:00:52+05:30

జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్న 3 నుంచి 4 నెలల వయస్సు గల పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి గత 40 రోజులుగా వస్తుండడంతో వారిని పరీక్షించిన వైద్యులకు అసలు ఏ వ్యాధితో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతూ రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారో అర్థం కాకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 23: జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్న 3 నుంచి 4 నెలల వయస్సు గల పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి గత 40 రోజులుగా వస్తుండడంతో వారిని పరీక్షించిన వైద్యులకు అసలు ఏ వ్యాధితో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతూ రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారో అర్థం కాకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఇప్పటికీ ఆరుగురు చిన్నారులు ఇదే లక్షణాలతో ఆసుపత్రికి రాగా ఒకరు హైదరాబాద్‌లో చికిత్స పొందడం మిగిలిన 5 గురు మృతి చెందడంపై సదరు ఆసుపత్రి వైద్యులు సైతం ఆందోళన చెంది రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు మోహన్‌బాబు, అనిల్‌కుమార్‌, మోనికాలు ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రికి వస్తున్న చిన్నారుల లక్షణాలు ఎలా ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 రోజులుగా వివిధ గ్రామాల నుంచి మొత్తం 5 గురు చిన్నారులు జిల్లా కేంద్రంలోని శిశురక్ష ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రాగా వారికి చికిత్సను ప్రారంభించిన వైద్యులు వ్యాధి లక్షణాలు తెలియక హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారని తెలిపారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర అధికారులకు సమాచారం చేరవేశామని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్న చిన్నారులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె పనితీరు మందగించడంతో అసలు వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకోనేలోపు శ్వాసక్రియ రేటు పడిపోతుందని తెలిపారు. దీంతో వెంటనే నిలోఫర్‌కు పిల్లలను రిఫర్‌ చేశామని కొందరు మార్గమధ్యలో చనిపోవడంతో, మరికొందరు చికిత్స పొందుతూ చనిపోవడంతో ఏదో అంతుచిక్కని వ్యాధి ఉందేమోనని రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు సమాచారం చేశామని తెలిపారు. ముందస్తుగా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు తాము ప్రయత్నాలు చేసి అధికారులకు సమాచారం చేరవేస్తే కొందరు సోషల్‌ మీడియాలో తమపై దుష్పచారం చేయడం బాధాకరమైన విషయమని వాపోయారు.

Updated Date - 2023-08-24T00:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising