ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాన్సువాడ ఆస్పత్రిలో కార్పొరేట్‌ స్థాయి వైద్యం

ABN, First Publish Date - 2023-07-14T23:54:41+05:30

కార్పోరేట్‌ స్థాయిలో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అథితిగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- త్వరలోనే రూ.37.50కోట్లతో నూతన ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం

- మంత్రి బొత్సకు మతి భ్రమించింది

- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

బాన్సువాడ, జూలై 14: కార్పోరేట్‌ స్థాయిలో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అథితిగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.3కోట్లతో నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన 10 బెడ్స్‌, డయాలసిస్‌ యూనిట్‌, రూ. 27 లక్షలతో ఏర్పాటు చేసిన స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌, రూ. 5 లక్షలతో నిర్మించిన రోగుల సహాయక షెడ్డు, డీఈఐసీ వార్డులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో ఏ స్థాయిలోనైతే వైద్యసేవలు ఉంటాయో ఆ తరహాలోనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏర్పాటు చేశామన్నారు. బాన్సువాడ పట్టణంలోని పాత ఏరియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో త్వరలోనే నూతనంగా రూ.37.50 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం చేసేందుకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. రూ. 3 కోట్లతో నూతనంగా స్టీల్‌ ఫుట్‌బ్రిడ్జిని నిర్మించామన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఇప్పటికే 5 డయాలసిస్‌ బెడ్స్‌ ఉండగా కొత్తగా మరో 5 యూనిట్లు ఏర్పాటు చేయించామన్నారు. రూ. 27 లక్షలతో నవజాత శిశువుల వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఫిజియోథెరపీ వైద్యం అందించడానికి డీఈఐసీ వార్డులను కూడా ఏర్పాటు చేయించామన్నారు. భోజనాల కోసం రూ.5లక్షలతో షెడ్డు నిర్మించామన్నారు. అలాగే ఒక టిఫా మిషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే రూ. 37.50 కోట్లతో నూతన భవనం నిర్మించడానికి అనుమతులు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌, డీసీహెచ్‌ డా. విజయ లక్ష్మీ, డీఎంఅండ్‌హెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి బొత్సకు మతి భ్రమించింది

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణకు మతి భ్రమించిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థపై విద్యార్థులను అవమానించేలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. శుక్రవారం బాన్సువాడలోని తన స్వగృహంలో స్పీకర్‌ విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలోని విద్యార్థులను, ఉపాధ్యాయులను అవమానించేలా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని, ఈ పద్ధతి సరైంది కాదన్నారు. గతంలో వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణంలో బొత్స పాత్రేంటో ప్రజలందరికీ తెలుసునన్నారు. పిచ్చెక్కి అనవసర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. దేశంలోనే విద్యావ ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. ఎవరైనా నక్కలు కొట్టి పాసవుతారా!? అని ప్రశ్నించారు. బొత్స నక్కలు కొట్టి పాసయ్యాడు కాబట్టే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రైతు కాదన్నారు. రైతుల పట్ల వివక్ష చూపుతూ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ఎకరానికి గంట విద్యుత్‌ సరిపోతుందనడం రైతులను పొట్ట కొట్టడమేనన్నారు. చంద్రబాబు బినామీ, ఏజెంట్‌ రేవంత్‌రెడ్డి అని పోచారం ఆరోపించారు.

Updated Date - 2023-07-14T23:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising