ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల చేతిలో మోసపోవద్దు

ABN, First Publish Date - 2023-08-18T00:36:38+05:30

సీఎం కేసీఆర్‌ సహకారంతో బాల్కొండ నియోజవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు మోసపోవద్దని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం భీమ్‌గల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

భీమ్‌గల్‌ రూరల్‌, ఆగస్టు 17: సీఎం కేసీఆర్‌ సహకారంతో బాల్కొండ నియోజవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు మోసపోవద్దని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం భీమ్‌గల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు అధికారం కోసం అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని రైతులను నమ్మించి ఎంపీగా గెలిచిన అర్వింద్‌ ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అంతకు ముందు మెండోరా గ్రామం నుంచి లింబాద్రి గుట్ట వరకు రూ.4.30 కోట్లతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండలం నుంచి చేంగల్‌ గ్రామం ఎన్‌ హెచ్‌ 44 నుంచి వయా చింతలూరు సింగిల్‌ నుంచి డబుల్‌ లైన్‌తో రూ.18.50 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-18T00:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising