ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రైతులు ఉద్యమించాలి

ABN, First Publish Date - 2023-08-18T00:37:37+05:30

జిల్లాలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రైతులు ఐక్యంగా ఉద్యమించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్‌ ఆకుల పాపయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గురువారం చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

ఖిల్లా, ఆగస్టు 17 : జిల్లాలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రైతులు ఐక్యంగా ఉద్యమించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్‌ ఆకుల పాపయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గురువారం చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం మూసివేసిందని, దానిని నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. సారంగపూర్‌ చక్కెర ఫ్యాక్టరీ తెలంగాణలోనే సహకార సంఘంలో కొనసాగిన ఏకైక ఫ్యాక్టరీ అని 2008లో నష్టాల పేరుతో ఫ్యాక్టరీని మూసివేశారన్నారు. 99ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఫ్యాక్టరీపై అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకులు అట్టి భూములను చౌకగా కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా గౌరవ అద్యక్షులు నాయక్‌వాడి నర్సయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: సారంగపూర్‌ చక్కెర సహకార కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని రైతులు డి మాండ్‌ చేశారు. గురువారం సారంగపూర్‌లో అకిల భారత కిసాన్‌ సంఘ్‌ కార్యవర్గ సభ్యు లు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్యాక్టరీని రైతులకు అప్పగించకపోతే ఈనెల 21న కలెక్టరేట్‌ కార్యాలయం ముందు చెరుకు రైతులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్‌ మండలంలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు కొండల్‌ సాయిరెడ్డి, నానా ఆక్కే, నారాయణరెడ్డి, సూర్యరెడ్డి, రాఘవేందర్‌, పెంట్టాజీ, సాయినాథ్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-08-18T00:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising