ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manchryala Dist.: మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2023-12-10T12:00:18+05:30

మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు బీట్ అధికారి శ్రీలత తెలిపారు.

వెంచపల్లి ఫారెస్టు బీట్ పరిధిలో బీహార్ కూలీలతో ప్లాంటేషన్ పనులు చేయిస్తున్నానని శ్రీలత తెలిపారు. కూలీల డబ్బుల విషయంలో మాట్లాడేందుకు తన కార్యాలయానికి రావాలని కోటపల్లి రేంజర్ రవి తనకు ఫోన్ చేశారని.. సాయంత్రం అయినా రేంజర్ కార్యాలయానికి రాకపోవడంతో తాను ఇంటికి బయలుదేరానని శ్రీలత చెప్పారు. అయితే రాత్రి కార్యాలయానికి వచ్చిన రవి తనను రమ్మన్నారని, వెళ్లిన తర్వాత తనను తీవ్రంగా దూషించడంతోపాటు సస్పెండ్ చేస్తానని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు శ్రీలత తెలిపారు. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్నారు. మరోవైపు శ్రీలత తనపై చేసిన ఆరోపణలను రేంజర్ రవి ఖండించారు.

Updated Date - 2023-12-10T12:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising