ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాంధారిలో కుండపోత

ABN, First Publish Date - 2023-09-06T00:15:13+05:30

జిల్లాలో రెండు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం సైతం జిల్లా వ్యాప్తంగా 90.2 మి.మీ వర్షపా తం నమోదైంది. గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే గాంధారిలో అత్యధి కంగా 144.5మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాంధారి, సదాశివనగర్‌, నాగిరెడ్డిపేట, ఎల్లా రెడ్డి తదితర మండలాల్లోని ప్రాంతాల్లో సుమారు 1200ల ఎకరాలలో వరి, సోయా, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వరదల తాకిడికి రహదారులు ధ్వంసం అయ్యాయి.

కామారెడ్డి, సెప్టెంబరు 5 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో రెండు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం సైతం జిల్లా వ్యాప్తంగా 90.2 మి.మీ వర్షపా తం నమోదైంది. గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే గాంధారిలో అత్యధి కంగా 144.5మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాంధారి, సదాశివనగర్‌, నాగిరెడ్డిపేట, ఎల్లా రెడ్డి తదితర మండలాల్లోని ప్రాంతాల్లో సుమారు 1200ల ఎకరాలలో వరి, సోయా, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వరదల తాకిడికి రహదారులు ధ్వంసం అయ్యాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 35వేల క్యూసెక్కుల వరదను మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగుల్లో నీరు చేరింది. 17.802 టీఎంసీ లకు గాను 17.108 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. పోచా రం ప్రాజెక్ట్‌లోకి 15,744 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండుకోవడంతో దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ లోకి 5,602 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో వస్తుండ గా మూడు గేట్లు ఎత్తి దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. లింగం పేట పెద్దవాగు వరద ప్రవాహంతో పోటెత్తుతోంది.

మండలాల వారీగా వర్షపాతం ఇలా..

గాంధారిలో 144.5 మి.మీ వర్షం కురువగా, కామారెడ్డిలో 99.5, నాగిరెడ్డిపేటలో 91.5, రామారెడ్డిలో 82.3, నిజాంసాగ ర్‌లో 73.8, మద్నూర్‌లో 73.5, లింగంపేటలో 72.5, జుక్కల్‌ లో 67.3, పిట్లంలో 65.5, పాల్వంచలో 63.5, బిచ్కుందలో 61.8, తాడ్వాయిలో 60.0, డోంగ్లీలో 59.0, రాజంపేటలో 56.5, దోమకొండలో 56.5, నస్రుల్లాబాద్‌లో 55.5, బీబీపేట లో 52.3, పెద్దకొడప్‌గల్‌లో 51.8, ఎల్లారెడ్డిలో 51.0, బీర్కూ ర్‌లో 50.8, భిక్కనూర్‌లో 46.0, బాన్సువాడలో 43.0, మాచా రెడ్డిలో 42.3, బిచ్కుందలో 40.0 మి.మీల వర్షం కురిసింది.

పశువుల మృతి

లింగంపేట: మండలంలోని బోనాల్‌, నల్లమడుగు తం డాలకు చెందిన పశువులు సోమవారం భారీ వర్షాల కారణం గా పెద్ద వా గు వరదనీటిలో మునిగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రైతులు తమ పశువులను పంట పొలాల సమీ పంలో కట్టి ఉంచగా భారీ వర్షాల కారణంగా పెద్దవాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో వాగు కు సమీపంలో ఉన్న పశువులు నీట మునిగి మృతి చెందిన ట్లు వారు తెలిపారు. బోనాల్‌తండాకు చెందిన గేదె, నల్లమడుగు తండాకు చెందిన సరిచెందర్‌కు చెందిన ఆవు నీట మునిగి మృతి చెందినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ఆదు కోవాలని వారు కోరుతున్నారు. మండలంలోని కోర్పోల్‌ గ్రామానికి నాగారం వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోక లు నిలిచిపోయాయి. లింగంపేట వయా నల్లమడుగు గాంధారి రహదారిపై రాంలక్ష్మణ్‌పల్లి వద్ద రోడ్డు తెగిపోవడ ంతో గాంధారి - నల్లమడుగు - లింగంపేట రాకపోకలు నిలి చిపోయాయి. అధికారులు స్పందించి వెంటనే రహదారి మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

దోమకొండ: మండలంలో మంగళవారం తెల్లవారుజ మున గంట పాటు భారీ వర్షం కురిసింది. గ్రామ శివారులో వర్షపు నీరు పోలా ల గట్ల మీద ను ంచి కాలువల్లో నిండుగా పారింది. చెరు వులు, కుంటలు అలుగులు పారాయి. దోమకొండ లో ఎర్రం రాజుకు చె ందిన ఇంటి గోడ కూలింది. ఎవరికి ఎలాంటి గాయా లు కాలేదు.

భిక్కనూర్‌లో కూలిన ఇళ్లు

భిక్కనూర్‌: మండల కేంద్రంతో పాటు మండలంలో ని ఆయా గ్రామాల చెరువులు, వాగులు పారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి అయ్యవారిపల్లి గ్రామం లో నర్సింలు, నర్సయ్య ఇళ్లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.

Updated Date - 2023-09-06T00:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising