ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎడతెరపి లేని వర్షం

ABN, First Publish Date - 2023-07-18T23:51:34+05:30

జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ముసురుతో కూడిన వర్షం కురుస్తునే ఉంది. ఎడతెరపులేని వర్షంతో జిల్లా తడిసిముద్దయింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పెద్ద వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతుండడం, వరినాట్లు వేసేందుకు సాగునీరు లేకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతూ వచ్చారు.

కొండాపూర్‌-ఎల్లారెడ్డి పల్లి గ్రామాల మధ్య వరద తాకిడికి రోడ్లు తెగిపోయిన దృశ్యం

- విస్తారంగా వర్షాలతో తడిసి ముద్దయిన జిల్లా

- జిల్లావ్యాప్తంగా 70.4 మి.మీ వర్షపాతం నమోదు

- అత్యధికంగా మాచారెడ్డిలో 97.2 మి.మీ.లు కురిసిన వర్షం

- ఈసీజన్‌లో ఇదే పెద్ద వర్షం

- వరి రైతుల్లో చిగురించిన ఆశలు.. నాట్లు వేయడంలో అన్నదాతలు బిజీ

- పలు మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

- రాజంపేటలో వరుదతాకిడికి కొట్టుకుపోయిన రోడ్డు

- జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లోకి చేరుతున్న వరద

కామారెడ్డి, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ముసురుతో కూడిన వర్షం కురుస్తునే ఉంది. ఎడతెరపులేని వర్షంతో జిల్లా తడిసిముద్దయింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పెద్ద వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతుండడం, వరినాట్లు వేసేందుకు సాగునీరు లేకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతూ వచ్చారు. ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తుండడం, ఈ సీజన్‌లో ఇదే పెద్ద వర్షం కావడంతో ప్రజలు, అన్నదాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 70.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా మాచారెడ్డిలో 97.2 మి.మీ వర్షం కురిసింది. ఎడతెరపులేని వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు వరద ఉధృతితో ప్రవహిస్తుండగా మరికొన్నిచోట్ల చెక్‌డ్యాంలు, మత్తడిలు పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లైన నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ ప్రాజెక్ట్‌లతో పాటు పెద్ద చెరువులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది.

తడిసిముద్దయిన జిల్లా

ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుండడంతో జిల్లా తడిసి ముద్దయింది. ముసురుతో కూడిన ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుండడంతో పట్ణణ కేంద్రాల్లోనే కాకుండా మండలాల్లోనూ ప్రజలు ఇంటిపట్టుకే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ముసురు వర్షంతో మార్కెట్‌లోనూ కాస్త జనజీవనం స్తంభించింది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్ల మధ్య వరదనీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారుల్లో వరద నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో వరదల తాకిడికి రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాజంపేట మండలం కొండాపూర్‌- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వరదతాకిడికి మట్టిరోడ్లు కొట్టుకుపోవడంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూర్‌ మండలం జంగంపల్లిలో ఈదురుగాలులతో వర్షం కురువడంతో విద్యుత్‌ తీగలు తెగిపడి 6 గొర్రెలు మృతి చెందాయి.

జిల్లావ్యాప్తంగా 70.4 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 70.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాచారెడ్డిలో 97.2 మి.మీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇదే పెద్ద వర్షం కావడం విశేషం. మద్నూర్‌లో 28.2 మి.మీ వర్షం కురువగా జుక్కల్‌లో 20.8 మి.మీ, పెద్ద కొడప్‌గల్‌లో 24.7 మి.మీ, బిచ్కుందలో 35.6 మి.మీ, బీర్కూర్‌లో 37.5 మి.మీ, నస్రూల్లాబాద్‌లో 43.0 మి.మీ, బాన్సువాడలో 46.2 మి.మీ, పిట్లంలో 25.6 మి.మీ, నిజాంసాగర్‌లో 32.2 మి.మీ, నాగిరెడ్డిపేటలో 39.4 మి.మీ, ఎల్లారెడ్డిలో 34.2మి.మీ, లింగంపేటలో 46.5మి.మీ, గాంధారిలో 56.2 మి.మీ, సదాశివనగర్‌లో 40.3 మి.మీ, తాడ్వాయిలో 55.7 మి.మీ, రాజంపేటలో 53.0 మి.మీ, భిక్కనూర్‌లో 45.3మి.మీ, కామారెడ్డిలో 58.2 మి.మీ, దోమకోండలో 56.6 మి.మీ, బీబీపేటలో 61.2 మి.మీ, డోంగ్లిలో 31.8 మి.మీ, పల్వంచలో 76.2 మి.మీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో జిల్లాలో ఇదే పెద్ద వర్షం. జూన్‌ నుంచి ఇప్పటి వరకు 255.9 మి.మీ వర్షం కురిసింది. గత ఏడాదితో పోలిస్తే-7.2 మి.మీ వర్షపాతం తక్కువగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్ట్‌లు, చెరువుల్లోకి స్వల్పంగా చేరుతున్న వరద

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రధాన ప్రాజెక్ట్‌లతో పాటు పెద్ద చెరువులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గాంధారి, లింగంపేట మండలాల్లో కురుస్తున్న వర్షాలకు లింగంపేట పెద్దచెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద పోచారం ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1,176 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అదేవిధంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి సైతం స్వల్పంగా వరద వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లోకి 1000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రస్తుతం 3.304 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కౌలాస్‌ ప్రాజెక్ట్‌లోకి సైతం 208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 0.765 టీఎంసీల నీరు ఉంది. కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లోని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువుల చెక్‌డ్యాంలు మత్తడులు దుంకుతున్నాయి. లింగంపేట మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో పెద్దవాగు వరద ఉధృతితో ప్రవహిస్తోంది. గాంధారి మండల కేంద్రంలోని వాగులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దకొడప్‌గల్‌ మండలం పోచారం గ్రామానికి వెళ్లే రహదారిలో కాజ్‌వేపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట, మాచారెడ్డి, పల్వంచ తదితర ప్రాంతాల్లోనూ వాగులు, వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వరినాట్లు ఊపందుకునే అవకాశం

ఈ వర్షకాలం సీజన్‌లో జిల్లాలో పెద్ద వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. జూలై మాసం ముగుస్తున్నప్పటికీ పెద్ద వర్షాలు లేకపోవడంతో వరినాట్లు వేయడంపై రైతులు అయోమయానికి గురవుతూ వచ్చారు. అడపాదడపాగా కురిసిన చిరుజల్లులు సోయా, పత్తి, మొక్కజొన్న పప్పుదినుసు పంటలకు మేలు చేకూర్చింది. పెద్ద వర్షాలు లేకపోవడంతో వరినాట్లు మాత్రం రైతులు వేసేందుకు ముందుకు రాలేదు. అయితే అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వరి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పంట చేన్లలో వర్షపునీరు నిలవడం నాట్లు వేసేందుకు ట్రాక్టర్లతో దమ్ముచేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు లేని కారణంగా కేవలం 25 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలతో వరినాట్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-07-18T23:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising