TS News: నిజామాబాద్లో ఇరిగేషన్ అధికారి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-01-06T10:24:29+05:30
బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఇరిగేషన్ అధికారి రమణారావు ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్: బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఇరిగేషన్ అధికారి రమణారావు ఆత్మహత్య చేసుకున్నాడు. యంచ సరిహద్దులో రమణారావు మృతదేహం లభ్యమైంది. రమణారావు నవీపేట్ మండలం పోతంగల్ గ్రామ నివాసి. ఆర్మూర్ ఇరిగేషన్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్న రమణారావు.. ఎమ్మెల్సీ కవితకు దగ్గరి బంధువు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-01-06T10:24:30+05:30 IST