జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులపై పట్టింపులేదు
ABN, First Publish Date - 2023-03-15T01:52:17+05:30
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై కొనసాగిన వివక్ష ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే తరహాలో ప్రాజెక్టులపై వివక్షత కొనసాగుతోందని.. అప్పుడు జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. రీడిజైన్‌ల పేరిట బడ్జెట్‌ను పెంచి ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం పూర్తిచేయడంలేదన్నారు.
ప్రాణహిత, చేవేళ్ల ప్యాకేజీల పనులు 75 శాతం పూర్తి
అయినా రీడిజైన్ పేరిట రూ.3500 కోట్లకు బడ్జెట్ పెంపు
మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌ను ఉపసంహరించుకోవాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, మార్చి 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మోపాల్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై కొనసాగిన వివక్ష ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే తరహాలో ప్రాజెక్టులపై వివక్షత కొనసాగుతోందని.. అప్పుడు జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. రీడిజైన్‌ల పేరిట బడ్జెట్‌ను పెంచి ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం పూర్తిచేయడంలేదన్నారు. మంగళవారం మోపాల్ మండలం మంచిప్ప రిజర్వాయర్‌ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించి ముంపు బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టును చేపట్టిందన్నారు. దానిలో భాగంగానే జిల్లాలో ప్యాకేజీ 20 ,21, 22 చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పనులను కూడా 75శాతం పూర్తిచేసి రూ.900 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. అప్పటి నీటి పారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పనులను పరిశీలించడంతో పాటు త్వరగా పూర్తయ్యేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కొండెం చెరువు కెపాసీటిని 0.84 టీఎంసీగా చేసి సాగునీరు అందించాలని నిర్ణయించాలన్నారు. ఈ ప్రాంత రైతుల భూములు ముంపునకు కాకుండా ఉన్న రిజర్వాయర్ ద్వారా లక్ష 83ఎకరాల సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. మరో రూ.300 కోట్లు ఖర్చుచేస్తే ఈ ప్రాంతానికి సాగునీరు అందేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్యాకేజీలను రీడిజైన్ చేశారన్నారు. కాళేశ్వరం ప్యాకేజీలో కలిపి బడ్జెట్‌ను రూ.3,500 కోట్లకు పెంచారన్నారు. మంచిప్ప రిజర్వాయర్ ఎత్తును 3.5 టీఎంసీలు చేయడం వల్ల పలు గ్రామాలు నీటమునుగుతున్నాయన్నారు. మూడు వందల కోట్లకు పూర్తికావాల్సిన ప్రాజెక్టును 3,500ల కోట్లకు పెంచినా, సాగుమాత్రం పెరగడంలేదన్నారు. భూములు కోల్పోతున్న రైతులు ఎత్తు పెంచవద్దని నిరసన తెలిపితే వారిపైన 307 కేసులు పెట్టారన్నారు. ధర్నా చేసిన 17 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారని ఆయన విమర్శించారు. వారిపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లయిన 21 ప్యాకేజీ పనులు పూర్తికాలేదన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని, ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి సాగునీరు అందించాలన్నారు. భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. రీడిజైన్‌ను వెనక్కి తీసుకుని పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని అన్నారు. ముంపు బాధితులకు ఇబ్బందికరమైన చర్యలు చేపడితే స్థానిక ఎమ్మెల్యేను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ వెంట మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్, గడుగు గంగాధర్, నగేష్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, రత్నాకర్ పాల్గొన్నారు. కాగా.. రేవంత్‌రెడ్డి యాత్రకు అడుగడుగునా భారీ స్పందన లభించింది. యాత్ర పొడవునా జనం జేజేలు పలికారు.
అన్ని దందాల్లో అధికార పార్టీ నేతలే..
ఎమ్మెల్యేల కొడుకుల ఆగడాలకు అంతులేదు
మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలి
బాధిత ముంపు తండాలను కాపాడాలి
అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
డిచ్‌పల్లి కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/డిచ్‌పల్లి: జిల్లాలోని ఏ నియోజకవర్గం చూసినా ఇసుక దందాలు, భూముల కబ్జాలు కనిపిస్తున్నాయని, ఎమ్మెల్యేల కొడుకుల ఆగడాలకు అంతులేదని అన్ని దందాల్లో వారే ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మోపాల్ నుంచి డిచ్‌పల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. డిచ్‌పల్లి డిచ్‌పల్లి బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఒకప్పుడు జిల్లాకు ఘనకీర్తి ఉండేదని గతంలో నీతికి నిజాయతికి పోరాట పటిమకు కట్టుబడ్డ నేతలు ఈ జిల్లాలో పనిచేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాలో అలాంటి నేతలే కరువయ్యారని ఆయన అన్నారు. మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసి తండాలను కాపాడాలన్నారు. ప్రాజెక్టు వ్యయం పెంచడం వల్ల ఒక ఎకరా ఆయకట్టు కూడా పెంచలేదన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం పెరగడం వల్ల 10వేల మంది తండావాసులు నిరాశ్రయులు అవుతున్నారన్నారు. ప్రాజెక్టుల వల్ల కోట్ల రూపాయలు డబ్బు దారిమళ్లుతుందని విమర్శించారు. ప్రభుత్వం భూసేకరణ ఆపకపోతే తండావాసులకు మద్దతుగా పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ఉద్యోగ భద్రతలేదని, ఉద్యోగులకు జీతాలు సరిగా రావడంలేదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 50 మందికి పైగా కార్మికులు చనిపోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 60లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను దివాలా తీయించారన్నారు. పాత డిజైన్ ప్రకారమే 21 ప్యాకేజీ పనులు పూర్తిచేయాలన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు 5లక్షల రూపాయలను అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీచేయడంలేదు కానీ పేపర్‌లీకులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పేదలందరికీ 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ అంజనికుమార్‌యాదవ్, డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, తాహెర్‌బిన్ హుందాన్, గడుగు గంగాధర్, మోహన్‌రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-03-15T01:52:17+05:30 IST