ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గజ్వేల్‌ తరహాలో కామారెడ్డి అభివృద్ధి

ABN, First Publish Date - 2023-09-15T00:16:35+05:30

భవిష్యత్తులో కామారెడ్డి గజ్వేల్‌ తరహాలో అభివృద్ధి చెందడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ కామారెడ్డికి వస్తే జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా మొత్తం సమగ్ర అభివృద్ధి బాట పడుతుందని అన్నారు.

- కేసీఆర్‌ కామారెడ్డికి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం

- కామారెడ్డి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలి

- జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటు పడుతున్న కేసీఆర్‌

- 9 ఏళ్లలో కామారెడ్డి ఎంతో అభివృద్ధి చెందింది

- అందుబాటులోకి జిల్లా మత్స్యకారులకు మార్కెటింగ్‌ వ్యవస్థ

- జమిలి ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంది

- చిల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లు

- విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కామారెడ్డి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో కామారెడ్డి గజ్వేల్‌ తరహాలో అభివృద్ధి చెందడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ కామారెడ్డికి వస్తే జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా మొత్తం సమగ్ర అభివృద్ధి బాట పడుతుందని అన్నారు. 9 ఏళ్లలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నందున ఇక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. తెలంగాణలో కేసీఆర్‌ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ చేయని, ఎన్నికల మేనిఫేస్టోలో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతంగా ప్రగతి సాధించిందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొర్రెలు, చేపల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సబ్సిడీతో గొర్రెలు, చేపలు పంపిణీ చేయడంతో గొల్లకుర్మ, మత్స్యకారులు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. మత్స్యకారులు, దళారుల చేత మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపలను అమ్ముకునేందుకు మార్కెటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. త్వరలోనే కామారెడ్డి జిల్లాలోని ఆయా పట్టణ కేంద్రాల్లో మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు చేపల మార్కెట్‌ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో రాబోవు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం ఓటమి పాలవుతుందనే భావనతో జమిలి ఎన్నికలను తెరమీదకు తెచ్చారని ఈ ఎన్నికలతో బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జమిలి ఎన్నికలతో మోదీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లిన కర్ణాటక మాదిరిగానే ఓటమి పాలవుతారని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సభలో జమిలి ఎన్నికలు ఉంటాయా లేదా అనేది తేలనుందని అన్నారు. 9 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రి, నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్టునైనా తీసుకువచ్చారా అని మంత్రి నిలదీశారు. కేవలం మత రాజకీయాలు చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందే తప్ప ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధికి పాటు పడడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చెప్పుకోదగ్గ ఏ గొప్ప ప్రాజెక్టును తీసుకురాలేదన్నారు. బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్‌ మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు. 40 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అప్పటి పాత ముచ్చట్లు చెబుతుందే తప్ప కొత్తవి ప్రజలకు ఉపయోగపడేవి, సాధ్యం కాని హామీలను చేస్తుందని విమర్శించారు. ఒక్కసారి ఛాన్స్‌ అంటూ కాంగ్రెస్‌ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని ఆ పార్టీ హామీలను నమ్మవద్దని అన్నారు. రైతు, ఎస్‌సీ డిక్లరేషన్‌లు చేస్తున్నాయే తప్ప స్పష్టమైన హామీలు కాంగ్రెస్‌ నేతలు ఇవ్వడం లేదన్నారు. ఇలా ఈ రెండు జాతీయ పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పనికి రాని హామీలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం ఉండాలనే ఆశయంతో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించనున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, ప్రభాకర్‌ యాదవ్‌, రాజారాం యాదవ్‌, కుంబాల రవి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్‌

రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిజామాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యలో కామారెడ్డిలోని ఓ హోటల్‌లో అల్పాహారం కోసం శుక్రవారం ఆగారు. ఈ సందర్భంగా మంత్రికి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అఽధికారి సింహారావు, మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, పాడి అభివృద్ధి మేనేజర్‌ శ్రీనివాస్‌లు ఘన స్వాగతం పలికారు. మంత్రి కలెక్టర్‌తో కలిసి అల్పాహారం చేశారు. అదేవిధంగా జిల్లా గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని గొర్రె పిల్లలతో ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-09-15T00:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising