కామారెడ్డి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం..
ABN, First Publish Date - 2023-09-08T00:34:44+05:30
ఏరి కోరి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని, రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని నిజాం తరహా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుండే ప్రారంభం కానున్నందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. గురువారం భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను మోకాలి లోతుకు నడుచుకుంటు వెళ్లి మాజీమంత్రి పరిశీలించారు.
- మాజీమంత్రి షబ్బీర్‌అలీ
- రామేశ్వర్‌పల్లిలో నీటమునిగిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పరిశీలన
భిక్కనూరు, సెప్టెంబర్ 7: ఏరి కోరి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని, రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని నిజాం తరహా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుండే ప్రారంభం కానున్నందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. గురువారం భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను మోకాలి లోతుకు నడుచుకుంటు వెళ్లి మాజీమంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేని ఇండ్లను కట్టి బినామీలైనా కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ రూ.1500లకోట్లతో ప్రగతి భవన్, రూ.15వేల కోట్లతో సచివాలయం కట్టుకుని పేదలకు మాత్రం నాణ్యతగా లేనివి, నీటిలో ఉండే ఇళ్లను కట్టిస్తావా అని ప్రశ్నించారు. కట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇంకా అర్హులైనా పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని, డబుల్‌బెడ్ రూం ఇళ్లలో మనుషులు లేకపోవడంతో అసాంఘిక కార్యకలపాలకు అడ్డాలుగా, కేసీఆర్ పర్మిట్ రూంలుగా మారాయని ఎద్దెవా చేశారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన అని అన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో చేసిన అభివృద్ధి ఏమి లేదని త్వరలోనే గజ్వేల్‌కు కామారెడ్డి ప్రజలను తీసుకెళ్లి అక్కడ పరిస్థితి ఎలా చూపిస్తానని, అలాగే గజ్వేల్ ప్జలను కామారెడ్డి తీసుకువచ్చి కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధిని చూపించనునన్నట్లు తెలిపారు. కేవలం కేసీఆర్‌కు కామారెడ్డిలో భూములపై కన్ను పడిందని, అందుకే ఇక్కడి నుండి పోటీ చేస్తున్నాడని అన్నారు. మాచారెడ్డి మండలంలో కేసీఆర్‌కు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మాణాలు చేయ్యడం ఒక భూటకమని, ఇప్పిటికే వాటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రేపటి నుండి ఆర్టీఏ ద్వారా ఆయాగ్రామపంచాయితీల్లో తీర్మాణ కాపీలను తీసుకోబోతున్నామని అన్నారు. తీర్మాణ కాపిని ఇచ్చిన కార్యదర్శులను, సర్పంచ్‌లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆర్టీఏ ద్వారా తీసుకున్న కాపీలతో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి గడ్డ ఉద్యమాల గడ్డని కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు చెల్లిస్తామని అన్నారు. కామారెడ్డిలో పుట్టానని ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన కామారెడ్డి ప్రజల మద్యలో ఉన్నానని, ఇకముందు కూడా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్‌రెడ్డి, నాయకులు లింబాద్రి, సుదర్శన్, తిర్మల్ స్వామి, అంకం రాజు, సిద్దాగౌడ్, లింగారెడ్డి, జీవన్, దయాకర్‌రెడ్డి, బాబు, రాజు, స్వామి, జైపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-08T00:34:44+05:30 IST