ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నులిమేద్దాం

ABN, First Publish Date - 2023-07-20T00:09:24+05:30

చిన్న పిల్లల్లో పౌష్టికాహారం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నులిపురుగుల నివారణలో భాగంగా చిన్నారులకు అల్బెండాజోల్‌ మాత్రలను ఇవ్వనున్నారు.

నాగిరెడ్డిపేట పిహెచ్‌సీలో ఏఎన్‌ఎం, ఆశాలకు అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి

-పిల్లల మానసిక,శారీరక ఎదుగుదలపై నులిపురుగుల ప్రభావం

-జిల్లావ్యాప్తంగా 2,92,352 మంది పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రల పంపిణి

-నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత ్సవం

- నూలి పురుగు నివారణకు అంతా సిద్ధం

నాగిరెడ్డిపేట/కామారెడ్డి టౌన్‌, జూలై 19: చిన్న పిల్లల్లో పౌష్టికాహారం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నులిపురుగుల నివారణలో భాగంగా చిన్నారులకు అల్బెండాజోల్‌ మాత్రలను ఇవ్వనున్నారు. చిన్నారులకు పౌష్టికాహార లోపం, రక్తహీనత, కడుపునొప్పి, బలహీనత, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలకు నులిపురుగులు కారణం అవుతున్నాయి. చిన్నారుల కడుపు పేగుల్లో తిష్ట వేసి ఆహార పోషకాలను గ్రహిస్తూ నెమ్మదిగా వృద్ధి చెందుతుంటాయి. వీటిలో నులి పురుగులు, ఏలిక పాములు, నట్టలు ఉంటాయి. ఇవి పిల్లల కడుపులో వృద్ధి చెంది మెళ్లగా రక్తంలో చేరి రక్తహీనతకు కారణమవుతున్నాయి. 1-19 సంవత్సరాలలోపు చిన్నారులకు అల్బెండాజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 20, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన మాత్రలు వేయకుండా మిగిలిపోయిన పిల్లలకు 27వ తేదీన వేస్తారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ చిన్నారులకు, బాలలకు అల్బెండాజోల్‌ మాత్రలు వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేశారు.

జిల్లా లక్ష్యం 2,92,352 మంది చిన్నారులు

జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న 2,92,352 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసే లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్ల పరిధిలో మాత్రలను పంపిణీ చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి మాత్రలు అందజేస్తారు. మాత్రల పంపిణీకి సంబంధించి ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను కేటాయించారు.

సిబ్బందికి అవగాహన

అల్బెండాజోల్‌ మాత్రల పంపిణీకి సంబంధించి జిల్లా, మండల స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో మండలాల పీహెచ్‌సీ వైద్యులకు అవగాహన కల్పించగా వారు మండల స్థాయిలో ఏఎన్‌ఎంలకు, ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ అల్బెండాజోల్‌ మాత్రలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు.

అపరిశుభ్రతే కారణం

నులిపురుగులు చిన్నారుల శరీరంలోకి ప్రవేశించడానికి అపరిశుభ్రతే ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. చిన్నారులు మట్టిలో ఆడుకోవడం, అదే చేతుల్లో ఆహార పదార్థాలు తినడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల ఉన్న పరాన్నజీవులు కడుపులో చేరుతాయి. కడుపులోని పేగుల్లోకి చేరి అక్కడ తిష్ట వేస్తాయి. పేగుల్లో ఉన్న ఆహారాన్ని పోషకాలను గ్రహిస్తూ నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడుతోంది. నులిపురుగులు పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు దారి తీస్తోంది. దీంతో చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రలు వేయరు

దీర్థకాలిక వ్యాధులు ఉన్న వారికి ఫిట్స్‌ రోగం వారికి అల్బెండాజోల్‌ మాత్రలు వేయొద్దని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సూచించారు. ఎవరికైనా అల్బెండాజోల్‌ మాత్రలు వేసిన తర్వాత ఏమైన దుష్పలితాలు కనిపిస్తే వెంటనే మండల వైద్యాధికారులను సంప్రదించాలని వారు కోరారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ మాత్రలను అందజేశారు. 1 నుంచి 2 సంవత్సరాల లోపు చిన్నారులకు సగం టాబ్లెట్‌ను ఇస్తారు. ఆపై మిగతా 2 నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలకు పూర్తి మాత్రను ఇచ్చి నమిలి మింగమని సూచిస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి లక్ష్మణ్‌సింగ్‌

నులిపురుగుల నివారణ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న 2,92,352 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నెల 20న పిల్లలకు అల్బెండాజోల్‌ మాత్రలు వేస్తాం. మిగిలిన వారికి ఈ నెల 27న వేస్తాం. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ అల్బెండాజోల్‌ మాత్రలు వేయించాలి. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు తగు చొరవ చూపాలి.

Updated Date - 2023-07-20T00:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising