ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముందుగానే మద్యం టెండర్లు

ABN, First Publish Date - 2023-08-02T23:49:48+05:30

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్‌ షెడ్యూల్‌ వస్తే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే అవకాశం ఉండకపోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం దుకాణాలకు వేలం వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం మద్యం దుకాణాల టెండర్ల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.

- ఎలక్షన్‌ ప్రభావంతో ముందుగానే టెండర్లు

- రేపు దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశఽం

- అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ

- దరఖాస్తుల ఫీజు రూ.2లక్షలు

- ఈనెల 21న లక్కీడ్రా

- డిసెంబరు నుంచి వైన్స్‌లు దక్కించుకున్న వారికి నిర్వహణకు అవకాశం

- జిల్లాలో 49 మద్యం దుకాణాలు, 8 బార్లు

- రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు

కామారెడ్డి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్‌ షెడ్యూల్‌ వస్తే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే అవకాశం ఉండకపోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం దుకాణాలకు వేలం వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం మద్యం దుకాణాల టెండర్ల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్నే అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వైన్స్‌ల టెండర్లపై ఇప్పటికే ఆయా జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో 49 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల సంఖ్య పెంచుతారా అనేది ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తేనే స్పష్టం కానుంది. వైన్స్‌లకు ప్రభుత్వం టెండర్లు పిలువనున్న నేపథ్యంలో మద్యం వ్యాపారులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే దరఖాస్తు రుసుము రూ.2లక్షలు ఉంటుందా లేదా పెంచుతారా తగ్గిస్తారా అనే దానిపై జోరుగా చర్చసాగుతోంది.

జిల్లాలో 49 మద్యం దుకాణాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలను పెంచుతూ వస్తోంది. 2018-19 సంవత్సరంలో 38 మద్యం షాపులు ఉండగా 2019-21 మద్యం పాలసీలో రెండు వైన్స్‌లను పెంచడంతో ఆ సంఖ్య 40కి చేరింది. 2021-23 మద్యం పాలసీలో 9 వైన్స్‌లను పెంచడంతో ఆ సంఖ్య 49కి చేరింది. కాగా ప్రస్తుతం జిల్లాలో 5 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ల పరిధిలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉన్నాయి. కామారెడ్డి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉండగా,దోమకొండలో 8, ఎల్లారెడ్డిలో 7, బాన్సువాడలో 9, బిచ్కుంద ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో పరిధిలో 10 వైన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ 49 మద్యం దుకాణాల గడువు లీజ్‌ డిసెంబరులో ముగియనుంది. అక్టోబరు, నవంబరులో ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయంలో టెండర్లు నోటిఫికేషన్‌ వేసే వీలుండదనే భావనతో మూడు నెలల ముందుగానే వైన్స్‌ల నోటిఫికేషన్‌ వేయనుంది.

4న వైన్స్‌ టెండర్ల కోసం నోటిఫికేషన్‌

మద్యం టెండర్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత అబ్కారీ విధానం ప్రకారమే గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసి అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ఈనెల 18 వరకు దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈనెల 21న కలెక్టర్‌ల సమక్షంలో వైన్స్‌లకు వచ్చిన దరఖాస్తులను లక్కీడ్రా ద్వారా కేటాయించనున్నారు. అయితే వైన్స్‌లను దక్కించుకున్న నిర్వాహకులు మాత్రం డిసెంబరు 1 నుంచి నడిపించుకునే అవకాశం కల్పించనున్నారు. అప్పటి వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న మద్యం వ్యాపారులే వైన్స్‌ల నిర్వహణ చేపట్టనున్నారు. దీనికి తోడు రిజిర్వేషన్లు కల్పించడంతో భారీగా దరఖాస్తు చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించనున్నారు. ఒక్కో దుకాణానికి 10 నుంచి 20 దరఖాస్తులు వచ్చే అవకాశం లేకపోలేదు.

మద్యం పాలసీ ఇలా..

2023-25 లీజు కాలానికి ప్రభుత్వం రిటైల్‌ మద్యం దుకాణాల ఎంపికను నిర్వహించనున్నది. దరఖాస్తులకు గతంలో లాగానే నాన్‌ రిఫండబుల్‌ ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించనున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. షాప్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ స్లాబ్‌లో ఎలాంటి మార్పులేదు. గతంలో సంవత్సరానికి రూ.50 లక్షలు, రూ.55 లక్షల ఎక్సైజ్‌ టాక్సులు అలాగే ఉంటాయి. టాక్సులు గతంలో నాలుగు వాయిదాల్లో చెల్లించగా ఇప్పుడు ఆరు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్‌ పొందడానికి ముందు సమర్పించాల్సిన బ్యాంకు గ్యారెంటీ గతంలో నాలుగు వాయిదాలు ఉండేవి. ఇప్పుడు కేవలం రెండు వాయిదాలకే పరిమితం చేసింది. రానున్న లీవ్‌ కాలానికి ప్రస్తుతం బ్యాంక్‌ గ్యారెంటి వార్షిక ఎక్సైజ్‌ టాక్స్‌లో కేవలం 25 శాతానికి మాత్రమే 25 నెలల కాల పరిమితితో ఇవ్వాల్సి ఉంటుంది.

సిద్ధమవుతున్న ఆశావహులు

ప్రభుత్వం మద్యం దుకాణాలకు ముందుగానే టెండర్లు వేసేందుకు కసరత్తు చేపడుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారులు, ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పాత మద్యం పాలసీనే అవలంభించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలను కేటాయించనున్నారు. గత మద్యం పాలసీ ప్రకారం టెండర్లలో ఎస్‌సీలకు, ఎస్‌టీలకు, గౌడ్‌ కులస్తులకు రిజర్వేషన్‌ను కల్పించారు. ఈ రిజర్వేషన్ల వెసులుబాటుతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోటీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండనున్నది. ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు నిర్ణయించగా నలుగురైదుగురు ఆశావహులు కొంత మొత్తాన్ని సేకరిస్తున్నారు. ఒకరిపై దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో దుకాణానికి 10 నుంచి 20 దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పబ్లిక్‌ డిమాండ్‌ ఉన్న చోట పోటీ ఎక్కువనే ఉండనున్నది.

Updated Date - 2023-08-02T23:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising