ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మధ్యాహ్న భోజనం.. హామీకే పరిమితం!

ABN, First Publish Date - 2023-08-11T00:09:17+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థుల భవిత పునాదుల స్థాయిలోనే కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు.

- ఏళ్లు గడుస్తున్నా కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి నోచుకోని పరిస్థితి

- ఊరించి ఉసూరు మనిపించిన ప్రభుత్వం

- మధ్యాహ్న భోజనం అమలు చేస్తే పేద విద్యార్థులకు తప్పనున్న అవస్థలు

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 10: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థుల భవిత పునాదుల స్థాయిలోనే కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. పేదరికంతో అల్లాడుతూ తమ పిల్లలు తమలాగా కష్టపడకూడదని తల్లిదండ్రులు ఏ పనికి పంపకుండా కళాశాలలకు పంపించి చదివిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మధ్యాహ్న భోజనంపై ఆనందం వ్యక్తం చేస్తు ఇక తమ పిల్లలకు మధ్యాహ్నం సమయంలో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు లేకుండా పోతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల ఆనందం ఆవిరైపోతోంది.

నాలుగేళ్ల క్రితం ప్రకటన

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివే విద్యార్థులు అప్పటి వరకు బాగానే ఉన్నా పట్టణాల్లోని ప్రభుత్వ కళాశాలల్లోకి అడుగుపెట్టగానే భోజనం విషయం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బయట హోటల్‌లో భోజనం చేసే స్థోమత లేక ఆకలితో అలమటిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమలు చేస్తామంటూ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ప్రకటించినా అమలుపై ఇంత వరకు స్పష్టత ఇవ్వడం లేదు. మంత్రివర్గ సమావేశంలోనూ ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వచ్చేప్పుడు బస్సు దొరుకుతుందో లేదోనని ఆగమేఘాలపైన కళాశాలకు వస్తున్న పిల్లలకు ఒకవేళ ఇంట్లో భోజనం సమయానికి అందించేవారు లేకపోతే అయితే హోటల్‌లు గతి అవడం లేదంటే పస్తులుండడం జరుగుతుందని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటున్నారు. కేవలం నోటిమాటలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్ప అమలుపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

అమలు చేస్తే మెరుగైన ఫలితాలు

ఈ పథకం ప్రభుత్వ కళాశాలల్లో అమలు చేస్తే విద్యార్థుల హాజరు పెరిగే అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత పెరిగేందుకు వీలుంటుంది. పౌష్టికాహారం అందడంతో చదువుపై దృష్టి సారిస్తారు. భవితకు బాటలు వేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులు ఆకలితో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 17 ప్రభుత్వ కళాశాలల్లో 2 వేలకు పైగా విద్యార్థులు చదువుతుండగా ఇందులో ఎక్కువ మంది పేదలే. ప్రైవేట్‌ కార్పోరేట్‌ కళాశాలల్లో ఫీజుల భారం భరించే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 18 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 2 వేలకు పైగా విద్యార్థులు చదువుతుండగా మిగితా విద్యార్థులు గురుకులాలు, ప్రైవేట్‌ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

Updated Date - 2023-08-11T00:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising