ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కూతురు వివాహం రద్దయిందని తల్లి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-18T00:59:18+05:30

మండల కేంద్రంలోని మత్తడి కింది పల్లెకు చెందిన నర్వ సవిత(36) తన కూతురు వివాహం రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట, జూన్‌ 17 : మండల కేంద్రంలోని మత్తడి కింది పల్లెకు చెందిన నర్వ సవిత(36) తన కూతురు వివాహం రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ సవిత కూతురు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వారి బందువుల అబ్బాయి మూగ విఠల్‌తో వివాహం నిశ్చయమైంది. మూడు నెలల తర్వాత వివాహం చేయాలని ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వివాహం కోసం సవిత భర్త ఆశయ్య ఉన్న ఇంటిని అమ్ముకుని ఖర్చులకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇంతలోనే వరుడు విఠల్‌ మరో అమ్మయిని తీసుకుని పారిపోయాడు. దీంతో తన కుమార్తె వివాహం ఆగిపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈనెల 15న సవిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఆశయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు.

Updated Date - 2023-06-27T12:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising