MP Arvind: ఆ యువతిని ఎస్ఐ భార్య ఏమీ అనలేదు..
ABN, First Publish Date - 2023-05-12T13:06:26+05:30
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భార్య ఆత్మ గౌరవం కాపాడుకోలేని పోలీసులకు రివాల్వర్ (Revolver), ఖాకీ డ్రెస్ (Khaki Dress) ఎందుకని ప్రశ్నించారు. బస్సులో ఉన్న యువతిని ఎస్ఐ (SI) భార్య ఏమీ అనలేదని.. బుర్కా వేసుకున్న యువతి ఫిర్యాదు ఇస్తే.. ఆగ మేఘాల మీద స్పందిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల మీద సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR) దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ సూచించారు. ప్రభుత్వం సక్రమంగా పని చేస్తే.. ఒక్క ధాన్యం గింజ కూడా వృధా కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలన్నారు. ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించడం మానెయ్యాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. ఎకరా పంట నష్టంకు రూ. పది వేలు ఏవని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అరవింద్ ప్రశ్నించారు.
వివరాల్లోకి వెళితే.. బుధవారం కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తుండగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సీటు విషయంలో ఎస్ఐ అనిల్‌కుమార్ భార్య.. షేక్ ఫర్హా అనే మహిళ గొడవపడ్డారు. ఈ సంఘటన గురించి ఎస్‌ఐ భార్య.. అతనికి ఫోన్‌లో చెప్పారు. దీంతో బస్సు జగిత్యాలకు చేరుకోగానే ఎస్‌ఐ.. బస్సును ఆపి.. ఫర్హాను ప్రశ్నించారు. ఈ ఘటనను పర్హా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా.. ఆమె నుంచి ఫోన్ తీసుకున్నారు. దీంతో పోలీసులు తనపై, తన తల్లిపై దాడి చేసినట్లు షేక్ ఫర్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు గురువారం ఎస్ఐ అనిల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-05-12T13:06:26+05:30 IST