TS News: నిజామాబాద్‌లో తల్లీకొడుకుల అదృశ్యం
ABN, First Publish Date - 2023-01-22T09:04:16+05:30
జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన తల్లీ, కొడుకు అదృశ్యం కలకలం రేపుతోంది.
నిజామాబాద్: జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన తల్లీ, కొడుకు అదృశ్యం కలకలం రేపుతోంది. దీపిక(25), తన ఏడాది వయసు గల కొడుకుతో కలిసి అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారిద్దరి ఆచూకి లభించలేదు. దీంతో భర్త జగన్ నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-01-22T09:04:17+05:30 IST