ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపలేరు

ABN, First Publish Date - 2023-07-30T00:04:36+05:30

ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపలేరని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వియార్‌ నెంబర్‌ 5లోని 3 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటిని ఆయన పరిశీలించారు. గంగమ్మకు పూలు చల్లి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలైలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండటం ఎంతో గొప్ప విషయమన్నారు.

కాలినడకన వెళుతూ పరిశీలిస్తున్న దృశ్యం

- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజాంసాగర్‌, జూలై 29: ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపలేరని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వియార్‌ నెంబర్‌ 5లోని 3 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటిని ఆయన పరిశీలించారు. గంగమ్మకు పూలు చల్లి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలైలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండటం ఎంతో గొప్ప విషయమన్నారు. జూన్‌ 21న సాగునీటిని విడుదల చేసుకున్న ఘనత ఆయకట్టు ప్రజలదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ సంవత్సరం ప్రాజెక్టులన్నీ సకాలంలో నిండుతున్నాయని, ప్రపంచంలోనే భారీనీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్‌ అన్నారు. వర్షాలు వస్తాయో రావోనని, జూన్‌ రెండవ వారంలో నిజాంసాగర్‌ నీటిని విడుదల చేశామన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పూర్తి భాగం, బోధన్‌ నియోజకవర్గం ఒక భాగంలో రైతులు వరి నాట్లు పూర్తి చేసుకున్నారన్నారు. ప్రాజెక్టు నుంచి సాగుకు ఒకటిన్నర టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. పది రోజుల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి నిండుకుండలా మారాయన్నారు. ఇప్పటి వరకుమూడున్నర టీఎంసీల నీరు విడుదల చేశారన్నారు. 1405 అడుగులకు నిల్వచేస్తూ మిగతా నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఈ ఏడాది వర్షాకాలం, యాసంగికి ఢోకా లేదన్నారు. వర్షాకాలం మరో రెండు నెలల పాటు పూర్తి నీరు అందిస్తారని, యాసంగికి 10 టీఎంసీల నీరు అవసరమన్నారు. కోతలు ముందుగానే వచ్చేట్లు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. లక్షా 50వేల ఎకరాలకు, మంజీరా వెంట మరో 60వేల ఎకరాలకు అందుతుందన్నారు. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యం ద్వారా నష్టపోయిన పంటలపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. కొంతమంది నీళ్లు లేని తుమ్మడి హట్టి కట్టాలని అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నాయకులు అంజిరెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్‌, పిట్లం మండలాల ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అఽధికారులు తదితరులున్నారు.

ప్రాజెక్టుపై పర్యాటకులతో సందడే సందడి

నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై రెడ్‌ అలర్ట్‌ను సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎత్తివేసి సందర్శకులకు అనుమతించాలని, పోలీస్‌, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. పోలీస్‌, ఇరిగేషన్‌ అధికారులు రెడ్‌ అలర్ట్‌ను ఎత్తివేసి పర్యాటకులకు అనుమతించారు. పాఠశాలలకు సెలవు దినాలు కావడంతో జిల్లా నలమూలల నుంచి పర్యాటకులు రావడంతో ప్రాజెక్టు కిటకిటలాడింది. ప్రాజెక్టుపై తిను భండారాల షాపులు వెలిశాయి. వియార్‌ నెంబర్‌ 5లోని 2 గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతం నుంచి 10వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. 1405 అడుగులకు గాను 1404.05 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను పూర్తిస్థాయి నీటిని నిల్వ చేస్తున్నారు. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, ఇరిగేషన్‌ శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

సాగు నీటి శాఖాధికారులు చెరువు, కుంటలను సందర్శించాలి

బాన్సువాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగు నీటి శాఖాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, చెరువులు, కుంటలను సందర్శించి వరద నీరు పారే అలుగులను పరిశీలించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్ట అలుగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలుగుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను, మట్టిని తొలగించి భారీ వర్షాలు పడ్డప్పుడు నీరు సాఫీగా పారేందుకు ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. మన నియోజకవర్గంలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, వానాకాలం సీజన్‌ ఇంకా రెండు నెలలు ఉన్నందున ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.

Updated Date - 2023-07-30T00:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising