ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కామారెడ్డిపైనే ప్రతిపక్షాల ఫోకస్‌

ABN, First Publish Date - 2023-08-24T00:06:26+05:30

కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేయనున్నందున అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కామారెడ్డిపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డికి వెళ్తున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ముమ్మరం చేశాయి. కామారెడ్డిలోనూ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండడం స్థానిక ప్రజల్లో ఆ పార్టీకి ఆ స్థాయి మద్దతు లేకపోవడంతో కేసీఆర్‌ను ఢీకొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.

- కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న కాంగ్రెస్‌

- పోటీకి సిద్ధమంటున్న బీజేపీ

- కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇరుపార్టీల వ్యూహం

- కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు ఉన్న వ్యతిరేకతను క్యాచ్‌ చేసుకునే ప్రయత్నం

- కేసీఆర్‌ ప్రభుత్వం వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న కాంగ్రెస్‌, బీజేపీ

- కేంద్ర, రాష్ట్ర ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు

కామారెడ్డి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేయనున్నందున అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కామారెడ్డిపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డికి వెళ్తున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ముమ్మరం చేశాయి. కామారెడ్డిలోనూ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండడం స్థానిక ప్రజల్లో ఆ పార్టీకి ఆ స్థాయి మద్దతు లేకపోవడంతో కేసీఆర్‌ను ఢీకొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలను దెబ్బతిసేందుకే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారంతో దానిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న వ్యతిరేకతను, కేసీఆర్‌ మోసాలను క్యాచ్‌ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కామారెడ్డికి కేసీఆర్‌ రాకతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని కుల సంఘాలు కాంగ్రెస్‌, బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. ఇదిలా ఉండగా కేసీఆర్‌ను ఎలాగైన ఓడిస్తానంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ సవాల్‌ విసురుతున్నారు. కేసీఆర్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నానంటూ బీజేపీ నేత వెంకటరమణరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది.

కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత

కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు భిక్కనూర్‌, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాలు రామారెడ్డి, రాజంపేటలోని కొన్ని గ్రామాలు వస్తాయి. అయితే ఈ నియోజకవర్గంలో మూడు పర్యాయాలుగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలుపొందారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేపై ప్రజల్లోకాస్త వ్యతిరేకత ఏర్పడడం, దీనికి తోడు పార్టీపై కూడా వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది. ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్‌లోని సెకండ్‌ క్యాడర్‌ నాయకులు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉండడం, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు సహకరించరనే ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్‌ సైతం గంప గోవర్ధన్‌తో పాటు పలువురు నేతలపై సర్వే చేయించినా ఓడిపోతారనే తేలింది. ఇదే సమయంలో కేసీఆర్‌ సైతం ఇక్కడ పోటిచేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వే చేయించగా సానుకూల రిపోర్టు రావడంతో కేసీఆర్‌ కామారెడ్డికి వస్తున్నారనే వాదన ఆ పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. కేసీఆర్‌ వచ్చినప్పటికీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకతను తొలగిస్తారా లేదా అనేది చూడాలి. ఇదే సమయంలో నియోజకవర్గ ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పార్టీపై, కేసీఆర్‌ మోసాలపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌, బీజేపీలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్‌ను కామారెడ్డిలోను ఓడించేందుకు ఈ రెండు ప్రధాన ప్రతిపక్షాల అధిష్ఠానం దృష్టి సారించి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను కేసీఆర్‌పై దింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న కాంగ్రెస్‌

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన ఓటు బ్యాంక్‌ ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ మంత్రి సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ రెండు పర్యాయాలుగా నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. అయితే గత మూడు సార్లు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌పై వరుసగా షబ్బీర్‌అలీ ఓటమి పాలవుతూ వచ్చారు. అయితే నియోజకవర్గంలో ప్రస్తుతం షబ్బీర్‌అలీపై కాస్త సానుభూతి పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌ ప్రత్యేక ఓటు బ్యాంక్‌ షబ్బీర్‌అలీకి కలిసిరానుంది. గత ఎన్నికల్లో స్వల్పఓట్లతో షబ్బీర్‌అలీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్‌అలీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోను ప్రచారం సాగింది. ఇదే క్రమంలో కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. కేసీఆర్‌ పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్‌ తరపున షబ్బీర్‌అలే బరిలో ఉండడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ను కామారెడ్డిలోనూ ఓడిస్తామంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులతో పాటు స్థానిక నేత షబ్బీర్‌అలీ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే షబ్బీర్‌అలీ గత కొన్ని రోజులుగా కామారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రజలతో మమేకమై బీఆర్‌ఎస్‌ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో నియోజకవర్గంలోని జనగామా, దోమకొండ, పల్వంచ గ్రామాల్లోని పలు కుల సంఘాలు, ముదిరాజ్‌ సంఘం నాయకులు షబ్బీర్‌అలీకి మద్దతు ప్రకటించి కేసీఆర్‌ను ఓడిస్తామంటూ ప్రకటించారు.

పోటీకి సై అంటున్న బీజేపీ

కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ సైతం సై అంటుంది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి బరిలో ఉంటే బీజేపీని బలహీన పరచవచ్చనే భావనతో బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయినప్పటికీ కేసీఆర్‌ బరిలో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ రద్దుకై, డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాల బకాయిలపై బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ నియోజకవర్గంలోను కాస్త పుంజుకుంది. గత ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి వెంకటరమణరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ ఎలాగైన నియోజకవర్గం నుంచి గెలవాలనే భావనతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కుల సంఘాలను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుల సంఘాల భవనాలకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఆలయాలకు సైతం ఆర్థిక సహాయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వెంకటరమణరెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నందున రాష్ట్రస్థాయి ముఖ్యనేతను కామారెడ్డి బరిలో దింపేందుకు బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్‌పై బీజేపీ నుంచి వెంకటరమణరెడ్డినే బరిలో ఉంచుతారా ఎవరైన రాష్ట్రనేతను దింపుతారా అనే దానిపై తేలాల్సి ఉంది. ఇదే క్రమంలో కామారెడ్డి నుంచి కేసీఆర్‌కు పోటీగా విజయశాంతిని దింపేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తుందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎవరిని బరిలో దింపుతుందో చూడాలి.

Updated Date - 2023-08-24T00:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising