ఈ వ్యక్తి బలవన్మరణం వెనుక ఎంత వేదన ఉందంటే..
ABN, First Publish Date - 2023-08-08T12:12:27+05:30
ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఆ వ్యక్తి వెనుక ఎంతటి వేదన ఉండాలి? కొందరైతే ఏదో క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుుంటారు. కానీ అందరూ అలా కాదు కదా. ఎంతో స్ట్రగుల్ అయి ఇక జీవితాన్ని సాగించడం కష్టమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
నిజామాబాద్ : ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఆ వ్యక్తి వెనుక ఎంతటి వేదన ఉండాలి? కొందరైతే ఏదో క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుుంటారు. కానీ అందరూ అలా కాదు కదా. ఎంతో స్ట్రగుల్ అయి ఇక జీవితాన్ని సాగించడం కష్టమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఈ వ్యక్తి ఆత్మహత్య కూడా అలాంటిదే. రూరల్ మండలం ఖానాపూర్ శివారులో సెల్ టవర్ పై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ పట్టణం దుబ్బలోని పవన్ నగర్‌కు చెందిన నవీన్ గిరిరాజ్ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అక్కడ మూడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించక.. కుటుంబాన్ని పోషించుకునే దారి లేక చివరకు జీవితాన్ని చాలించాడు. నవీన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - 2023-08-08T12:12:27+05:30 IST