ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాఠశాలలకు రక్షణ కరువు

ABN, First Publish Date - 2023-08-26T23:58:04+05:30

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే పాఠశాలలు కొందరు ఆకతాయిలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చోని తాగితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే పోలీసులు కేసులు పెడతారని ఆలోచన చేస్తు పాఠశాలలనే మద్యం తాగడానికి ఆవాసాలుగా చేసుకుంటున్నారు.

- బార్‌లను తలపిస్తున్న తరగతి గదులు

- స్మోకింగ్‌ స్పాట్‌లుగా పాఠశాలలు

- మద్యం తాగుతూ నానా విధ్వంసం సృష్టిస్తున్న మందుబాబులు

- పాఠశాల గదుల దర్వాజాలు, కిటికీలు పగులగొడుతున్న వైనం

- పాఠశాలలకు వాచ్‌మెన్‌లను నియమించాలంటున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 26: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే పాఠశాలలు కొందరు ఆకతాయిలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చోని తాగితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే పోలీసులు కేసులు పెడతారని ఆలోచన చేస్తు పాఠశాలలనే మద్యం తాగడానికి ఆవాసాలుగా చేసుకుంటున్నారు. విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు అని మర్చిపోతూ పాఠశాలలనే గంజాయి, స్మోకింగ్‌ స్పాట్‌లుగా మార్చేస్తూ పనిలో పనిగా పాఠశాల కిటికీలు, దర్వాజాలు, బల్లలను విరగగొట్టడం చేస్తు పాఠశాలలు విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. జిల్లాలోని అనేక పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంటుంది. మన ఊరు-మన బడి పేరు మీద కోట్లు ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం వాటిని సంరక్షించేందుకు వాచ్‌మెన్‌లను మాత్రం నియమించడం లేదని ఆయా పాఠశాలల చుట్టు పక్కల ఉన్న ప్రజలు వాపోతున్నారు. తాము ఎంతగానో మందుబాబులను మందలించినా వారు తిరగబడుతూ బూతు పురణాలు అందుకుంటున్నారని పేర్కొంటున్నారు. పలుచోట్ల పోలీసులు సైతం దృష్టి సారించకపోవడంతో పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొంటున్నారు.

జల్సాలకు పాఠశాలలే అడ్డాలు

జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు ఆకతాయిల జల్సాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారనే కనీస ఆలోచన చేయకుండా పాఠశాల ఆవరణలో సిగరెట్లు , మద్యం తాగడం చేస్తు ఆకతాయిలు జల్సాలు చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. తాము మందలించినా తిరగబడుతున్నారని ఇక పాఠశాల ముసివేశాక వారి చేష్టలు విపరీతంగా ఉంటున్నాయని తరగతి గదిలోని బల్లలు, కిటికీలు, దర్వాజాలు ధ్వంసం చేస్తున్నారని పేర్కొంటున్నారు. కామారెడ్డి పట్టణంలోని బాలికల పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. పాఠశాల ముగిసిందంటే చాలు భవనాలపై, తరగతి గదులలో సిగరెట్లు, మద్యం, కల్లు తాగుతూ పేకాట ఆడుతూ నానా విధ్వంసం సృష్టిస్తున్నారు. పాఠశాలలోని పలు తరగతి గదులు సెలవులు వస్తే చాలు బార్‌రూంను తలపిస్తాయి. ఎవరికి కనిపించకుండా పైన ఉన్న తరగతి గదిలో గంజాయి, మందు తాగుతూ, పేకాట ఆడుతున్నారని పాఠశాల పరిసరాలలో ఉన్న కాలనీవాసులు చెబుతున్నారు. గతంలో పాఠశాలలో రెండు అంగన్‌వాడీ సెంటర్లలో దొంగతనాలకు పాల్పడడంతో పాటు పాఠశాలలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేయడం, ఇటీవల మన ఊరు-మన బడి కింద చేసిన పలు పనులను సైతం పనికిరాకుండా చేశారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మన ఊరు-మన బడి కింద చేపట్టిన పలు పనులను ప్రారంభించేందుకు పాఠశాలకు రాగా ఉపాధ్యాయులు ఆకతాయిల ఆగడాలను వివరించడంతో పట్టణ పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పోలీసులు రాత్రి వేళలో పాఠశాలపై నిఘా ఉంచుతున్నా లాభం లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిత్యం మద్యం తాగుతూ గొడవలు పడుతున్న ఒకటి, రెండు గ్యాంగ్‌లకు చెందిన యువకులు ఈ పాఠశాలను గొడవలకు లేకుంటే మందు, స్మోకింగ్‌ స్పాట్‌లుగా మారుస్తున్నారని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.

లక్షలు విలువ చేసే సామగ్రి ధ్వంసం

కేవలం బాలికల పాఠశాలనే కాకుండా పట్టణంలోని గంజ్‌, బాలుర, హరిజనవాడ, ఇందిరానగర్‌, రాజీవ్‌నగర్‌, శ్రీరాంనగర్‌, పంచముఖి హనుమాన్‌, గొల్లవాడ పాఠశాలలతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. పట్టణంలోని బాలుర పాఠశాలలో సాయంత్రం వేళ మందుబాబులు మద్యం తాగుతూ ఘర్షణలు పడుతున్నారు. గతంలో ఈ పాఠశాలలో మద్యం తాగుతూ ఘర్షణలు పడి గాయాలపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని అనేక పాఠశాలలో కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలలను ఆధునికరిస్తున్నారు. ఈ లెక్కన పాఠశాలలో లక్షలు విలువ చేసే సామగ్రి ఉంటుందని ఆయా పాఠశాలలకు వాచ్‌మెన్‌లను నియమిస్తే పాఠశాలలో విధ్వంసాలకు చెక్‌ పడుతుందని దాంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలతో కూడిన విద్య అందుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గతంలో జిల్లా పరిషత్‌ల నుంచి నెలనెల జీతం ఇచ్చి వాచ్‌మెన్‌లను నియమించినప్పుడు ఇంతలా విధ్వంసం జరగలేదని ప్రస్తుతం వాచ్‌మెన్‌లను తొలగించడంతో పాఠశాలలో ఎప్పుడు ఏ వస్తువు పోతుందో ఏ విధ్వంసం జరిగిందోనని సంఘటనలు చూడాల్సి వస్తుందోనని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Updated Date - 2023-08-26T23:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising