కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ
ABN, First Publish Date - 2023-07-30T00:00:54+05:30
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కామారెడ్డి మున్సిపాలిటీ అవినీతిని నిర్మూలిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలోని బంజారాహిల్స్‌గా పిలుచుకునే విద్యానగర్, శ్రీరాంనగర్, దేవునిపల్లి, ఎన్‌జీవోస్‌కాలనీ, కాకతీయనగర్ కాలనీ, కల్కినగర్ కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయన్నారు.
కామారెడ్డి, జూలై 29: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కామారెడ్డి మున్సిపాలిటీ అవినీతిని నిర్మూలిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలోని బంజారాహిల్స్‌గా పిలుచుకునే విద్యానగర్, శ్రీరాంనగర్, దేవునిపల్లి, ఎన్‌జీవోస్‌కాలనీ, కాకతీయనగర్ కాలనీ, కల్కినగర్ కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయన్నారు. దీని అంతటికి కారణం నిద్రావస్థలో ఉన్న మున్సిపాలిటీ అధికారులని అన్నారు. కబ్జాలకు, కమీషన్లకు కక్కుర్తిపడి సెట్‌బ్యాక్ తీసుకోకుండా, మురికి కాలువలు నిర్మించకుండా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. బతుకమ్మ కుంటలో వర్షాలు పడితే చాలు ఇళ్లల్లోకి నీరు వచ్చేవని తాను అధికారంలో ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి శాశ్వతంగా నీటిముంపు సమస్య లేకుండా చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ తమ పార్టీలో నెలకొన్న వర్గవిభేదాలు చూసుకునేందుకు సమయం సరిపోవడంతో లేదని ఇక ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకుంటారని విమర్శించారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో, కేటీఆర్ పబ్బులు డ్రగ్స్‌లో బిజీగా ఉంటే కూతురు కవిత లిక్కర్ వ్యాపారంలో బిజీగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పాకజ్ఞానేశ్వరి, ఐరేని సందీప్, పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, పాత శివకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పోరుబాటతో మొద్దు నిద్రవీడిన ప్రభుత్వం
బీబీపేట: కాంగ్రెస్ పోరుబాటతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడి బీబీపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం షబ్బీర్‌ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీపేట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకోలు చేసిందని చివరకు ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. ఈ చేతగాని నాయకుల్ని ఎన్నుకుని నియోజకవర్గం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Updated Date - 2023-07-30T00:00:54+05:30 IST