ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌

ABN, First Publish Date - 2023-08-17T00:00:30+05:30

ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఈనెల 27, 28, సెప్టెంబరు 2, 3 తేదీల్లో ప్రతీ బూత్‌ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత, ఓటర్లు వినియోగిం చుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ రాజకీయ ప్రతినిధులకు సూచించారు. సెకండ్‌ సమ్మరి రివిజన్‌పై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 16: ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఈనెల 27, 28, సెప్టెంబరు 2, 3 తేదీల్లో ప్రతీ బూత్‌ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత, ఓటర్లు వినియోగిం చుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ రాజకీయ ప్రతినిధులకు సూచించారు. సెకండ్‌ సమ్మరి రివిజన్‌పై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 21న డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ప్రచురింపబడుతుందని, అట్టి ప్రతిని అందరికీ అందజేస్తామన్నారు. అక్టోబరు 4న తుది ఓటర్ల జాబితా వెలువడుతుందని, ఆ జాబితా ప్రకార మే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఓటరు జాబితాలో పేరులో మార్పులు, చేర్పులకు ఇదే చివరి అవకాశం కావడంతో అర్హులైన ప్రతీ యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. జనాభాలో 5 శాతం 18-19 ఏళ్లు నిండిన వారుంటారని జిల్లాలో రెండున్నర శాతం మాత్రమే ఓటరుగా నమోదయ్యారని, 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోద య్యేలా చూడాలన్నారు. కళాశాల స్థాయిలో ఓటరు నమోదుకు జిల్లా యంత్రాంగం స్వీప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతీ బూత్‌స్థాయిలో తమ ప్రతినిధులను ఏజెంట్లు నియమించుకోవాలని, డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను పరిశీలించి మార్పులు, చేర్పులు ఉంటే చేసుకో వాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు ఉంటే తొలగించాలని, ఒకే కుటుంబంలోని ఓటర్లు వివిధ పోలింగ్‌ బూతులతో ఉంటే సరి చేసుకో వాలని, అర్హులను ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఏమైన సమ స్యలుంటే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్‌ చేయాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు కూడా ఈవీఎంల ఓటింగ్‌ చేయుటపై కలెక్టర్‌, ఆర్‌డీవో కార్యాలయాలతో పాటు, మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా మాక్‌పోల్‌ నిర్వహిస్తూ అవగాహన కలిపిస్తున్నామన్నారు. వివిధ కారణాల వల్ల నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాలను మార్చమని, ప్రస్తుతమున్న 790 పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపడా ఈవీఏంలు, వీవీ ప్యాడ్‌లు అందుబాటులో స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్నాయని, ప్రతీనెల వాటిని పరిశీలిస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే కోడ్‌ అమలులోకి వస్తుందని, ఆ మేరకు రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలని కోరారు. ఎన్నికల నియామవళిని ఖచ్చి తంగా పాటించాలని, కుల, మత విద్వేషాల కు తావివ్వరాదని, వ్యక్తిగత దూషణ చేయరాదని, ఓటర్లను నగదు, మద్యం తో ప్రలోభ పెట్టరాదని, అభ్యర్థి గరిష్టం గా రూ.40లక్షలకు ఖర్చు మించకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఖాసీం అలీ, నరేందర్‌, నరేష్‌గౌడ్‌, జప్పార్‌ఖాన్‌, తాహెర్‌, హరిలాల్‌, వెంకట్‌గౌడ్‌, బాలరాజు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రచారం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రజాయింట్‌ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరా జ్‌ అహ్మద్‌ సాధారణ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల నిర్వహణ, నియోజకవర్గాల్లో ఓటింగ్‌ టర్న్‌ అవుట్‌పెంపుపై తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్ప త్తి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ జిల్లాలో స్వీప్‌ ద్వారా యువ ఓటర్ల నమోదు కు ముమ్మరంగా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు నమోదుపై అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అక్టోబరు 1, 2023 నాటికి 9,57,382 మంది జనాభా ఉండవచ్చని అంచనా వేశా మని తెలిపారు. ఈనెల 19న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓట్‌ఫర్‌ షూర్‌ నినాదంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో 5కే రన్‌ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరె న్స్‌లో స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ అనిల్‌, డిప్యూ టీ తహసీల్దార్‌ సాయిలు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T00:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising