ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెట్ల నరికివేతపై ఎక్కపల్లిలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-08-11T00:03:28+05:30

మండలంలోని ఎక్కపల్లిలో గత ఐదు రోజులుగా అటవీ భూముల విషయంలో చెట్లు, పొదలు నరికివేతపై గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై ప్రభాకర్‌లతో పాటు ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఎఫ్‌ఆర్‌వో ఓంకార్‌లతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు.

ఎక్కపల్లిలో ఆలయం వద్ద సమావేశమైన గ్రామస్థులు

- గ్రామస్థులు చర్చలకు రావాలన్న డీఎస్పీ, సీఐ, అటవీ అధికారులు

- ఇప్పటికే ఐదుగురిపై కేసులు, గ్రామంలో 144 సెక్షన్‌

లింగంపేట, ఆగస్టు 10: మండలంలోని ఎక్కపల్లిలో గత ఐదు రోజులుగా అటవీ భూముల విషయంలో చెట్లు, పొదలు నరికివేతపై గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై ప్రభాకర్‌లతో పాటు ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఎఫ్‌ఆర్‌వో ఓంకార్‌లతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు. గ్రామస్థులు ఆలయం వద్ద సమావేశమై పోలీసులు, అటవీ అధికారులు గ్రామంలోకి వస్తే చర్చలకు సిద్ధమని చెప్పగా పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు గ్రామ శివారులో కూర్చున్నారు. గ్రామానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు ఐదారుగురు వస్తే వారితో చర్చిస్తామని అధికారులు చెప్పగా, గ్రామానికి సంబంధించిన సమస్య కావున పోలీసులు, అటవీ అధికారులు గ్రామంలోకి వచ్చి అందరి ముందు చర్చించాలని డిమాండ్‌ చేశారు. అటవీ భూములను భూములు లేని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సాగు చేస్తే అటవీ అధికారులు 2016లో అందరికి జరిమానా విధించారని ఇప్పుడు కేవలం ఎస్టీలకే పట్టాలు ఎలా ఇస్తారని బీసీలకు పట్టాలు ఇవ్వకపోయినా సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్టీలు సాగులో లేకపోయినా పట్టాలు ఇచ్చారని పోడు పట్టాల సర్వేలో ఫారెస్ట్‌ అధికారులు ఆర్టీవోకు ఇచ్చిన ధ్రువ పత్రాలను చూపాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలు అటవీ భుములు సాగు చేసుకునేందుకు చట్టంలో ఎలాంటి అధికారాలు లేవని, చట్టానికి లోబడి ఉండాలని ఆయన గ్రామస్థులకు సూచించారు. గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులో ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఫారెస్టు అధికారులు చెప్పినప్పటికీ చెట్టు, పొదలు నరికిన ఐదుగురిపై అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని, విచారణ జరుగుతుందని అవసరమైతే విచారణలో మరికొంత మందిపై కేసులు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అడవులను నరకడం ఆపాలని డీఎస్పీ గ్రామస్థులకు సూచించారు. చర్చలకు అధికారులు గ్రామంలోకి రావడంతో గ్రామస్థులు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కాగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు కూడళ్ల వద్ద ఉన్న గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి కొందరు రైతులను పోలీసు జీపులో పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-08-11T00:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising