ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెరువులు నిండాయి.. చేప పిల్లలేవీ?

ABN, First Publish Date - 2023-08-22T23:55:33+05:30

జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే మత్స్యకారులకు సిరులు కురిపించే జలపుష్పాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు అందించడం లేదు. చేప పిల్లలను ఇప్పుడు వదిలితేనే వేసవి నాటికి మంచి సైజు, బరువుతో మత్స్యకారుల చేతికి వస్తాయి. వారికి మంచి లాభాలు అందిస్తాయి. గతంలో సెప్టెంబరులో చేప పిల్లలను వదలడంతో ఎదుగుదల లోపించినందున ఈ సారైన ఆలస్యం చేయకుండా చేప పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఎల్లారెడ్డిలో నిండుకుండలా ఉన్న ఊర చెరువు

- నిరీక్షిస్తున్న మత్స్యకారులు

- అదనుదాటితే ఎదగవని ఆవేదన

- ఈ ఏడాది 2 కోట్ల70లక్షల 80 వేల చేప పిల్లల పంపిణీ లక్ష్యం

- జిల్లాలో 697 చెరువులు, రెండు రిజర్వాయర్‌లు, రెండు ప్రాజెక్టులు

- 221 మత్స్య సంఘాలు, 13,600 మంది సభ్యులు

ఎల్లారెడ్డి, ఆగస్టు 22: జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే మత్స్యకారులకు సిరులు కురిపించే జలపుష్పాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు అందించడం లేదు. చేప పిల్లలను ఇప్పుడు వదిలితేనే వేసవి నాటికి మంచి సైజు, బరువుతో మత్స్యకారుల చేతికి వస్తాయి. వారికి మంచి లాభాలు అందిస్తాయి. గతంలో సెప్టెంబరులో చేప పిల్లలను వదలడంతో ఎదుగుదల లోపించినందున ఈ సారైన ఆలస్యం చేయకుండా చేప పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

పెరిగిన మత్స్య సంపద

మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేప పిల్లలను ఉచితంగా జలాశయాల్లో పోసి వృత్తిదారుల జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. దీంతో రాష్ట్రంలో మత్స్యసంపద గణనీయంగా పెరిగింది. అదేస్థాయిలో వినియోగం సైతం ఉంది. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ ద్వారా పెంపకాన్ని ప్రోత్సహిస్తుండగా పెరిగిన జలవనరులతో సహజ ఉత్పత్తులు సైతం పెరుగుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు, వాగులు ఉప్పొంగిన ప్రాంతాల్లో చేపలు రోడ్లపైకి వచ్చాయి.

2కోట్ల 70లక్షల 80వేల చేప పిల్లల పంపిణీ

మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్‌ ఏటా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా అధికారులు ఈ ఏడాది జిల్లాలో 2కోట్ల 70లక్షల 80వేల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా పరిధిలోని 24 మండలాల్లో మొత్తం 697 చెరువులు, రెండు రిజర్వాయర్‌లు, రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అదేవిధంగా 221 మత్స్య సంఘాలు ఉండగా ఇందులో 13,600 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఉచిత చేప పిల్లలను మత్స్యసహకార సంఘాల ద్వారా సరఫరా చేస్తారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ చేయలేదు. సకాలంలో చేప పిల్లలను జలాశయాల్లో వదిలితే వేటాడే సమయానికి పెరుగుతాయని మత్స్యకారులు ఆశిస్తున్నారు.

చెరువుల పరిమాణాన్ని బట్టి చేప పిల్లల పంపిణీ

చెరువుల పరిమాణానికి మించి చేప పిల్లలను వేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతున్నాయి. దీంతో మత్స్యకారులు నష్టాల పాలవుతున్నారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ సారి చెరువుల నీటి నిల్వ ఆధారంగా చేపలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని చెరువుల పరిమాణం, నీటి నిల్వ సామర్థ్యలపై స్థానిక రెవెన్యూ అధికారులచే సమగ్ర సమాచారం తీసుకుని దాని ఆధారంగా సంబంధిత అధికార యంత్రాంగం చేపల పంపిణీకి సిద్ధమైంది.

వారం రోజుల్లో చేపల పంపిణీ చేస్తాం

- వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖాధికారి, కామారెడ్డి

చేప పిల్లల పంపిణీకి చెందిన సిబ్బంది సమ్మెలో ఉన్నారు. సిబ్బంది చాలా మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులే ఉండడంతో పంపిణీలో జాప్యం ఏర్పడుతుంది. వారం రోజుల్లో పంపిణీ చేస్తాం. ఈ ఏడాది 2కోట్ల 70లక్షల 80వేల చేప పిల్లల పంపిణీని చేపట్టనున్నాం.

Updated Date - 2023-08-22T23:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising