ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చదువులు చెప్పేవారే లేరు

ABN, First Publish Date - 2023-08-04T00:10:50+05:30

జిల్లాలోని ఇప్పటికీ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేక చదువులు సాగడం లేదు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో చదువులు చెప్పే వారే కరవవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటున్నప్పటికీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలు 136 ఉన్నాయి.

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు

- జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

- 136 ఏకోపాధ్యాయ పాఠశాలలు

- వందల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

- ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం

- బోధించే వారు లేక చదువులు సాగడం లేదు

- ఫలితంగా విద్యార్థులు చదువులపై పట్టు సాధించడం లేదు

- ఉపాధ్యాయులను కేటాయించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు

- ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చిన భవానిపేట పాఠశాల విద్యార్థులు

- ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలోనూ పట్టింపులేని ప్రభుత్వం

- జిల్లాలో 856 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ

కామారెడ్డి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఇప్పటికీ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేక చదువులు సాగడం లేదు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో చదువులు చెప్పే వారే కరవవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటున్నప్పటికీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలు 136 ఉన్నాయి. ఆ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువులపై పట్టు సాధించడం లేదు. కనీసం జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చదువుకునేందుకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నప్పటికీ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు కాలయాపన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కేటాయించాలంటూ పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల లింగంపేట మండలం భవానిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేరంటూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు రావడమే ఇందుకు నిదర్శనం.

విద్యార్థులు చదువులపై పట్టు సాధించడం లేదు

జిల్లాలోని పలు మండలాల్లో, గ్రామాల్లో ఇప్పటికీ ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో విద్యాశాఖ నిబంధనల ప్రకారం 1:20 అంటే 20 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు, 21 నుంచి 59 వరకు విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు, 60 నుంచి 90 వరకు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో చాలా చోట్ల పలు ప్రభుత్వ పాఠశాలల్లో 60 నుంచి 100కు పైగానే విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థులకు బోధించే వారు లేక విద్యార్థులు చదువులపై పట్టు సాధించడం లేదనే భావన తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ఒకే ఒక ఉపాధ్యాయుడితో ఆయా ప్రభుత్వ పాఠశాలలను నెట్టుకు రావడంపై విద్యాశాఖ, ప్రభుత్వంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. జిల్లాలో ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 136 ఉన్నాయంటే విద్యార్థుల చదువులు, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల లింగంపేట మండలంలోని భవానిపేట ప్రాథమిక పాఠశాలలో 75 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థులు సక్రమంగా చదువుకోవడం లేదని తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు విద్యార్థులతో కలిసి వచ్చి ఆందోళన చేపట్టారు.

136 ఏకోపాధ్యాయ పాఠశాలలు

జిల్లా వ్యాప్తంగా 136 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చెప్పుకువస్తున్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని పలుమార్లు విద్యాశాఖకు సదరు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు విన్నవించినా విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా గాంధారి మండలంలో 15 ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 13, మద్నూర్‌ 6, డోంగ్లిలో 7, జుక్కల్‌లో 12, పెద్దకొడప్‌గల్‌లో 11, బిచ్కుందలో 4, బీర్కూర్‌లో 3, నస్రూల్లాబాద్‌లో 4, బాన్సువాడలో 6, పిట్లంలో 6, నిజాంసాగర్‌లో 7, నాగిరెడ్డిపేటలో 7, లింగంపేటలో 10, సదాశివనగర్‌లో 8, రాజంపేటలో 5, భిక్కనూర్‌లో 4, రామారెడ్డిలో 1, మాచారెడ్డిలో 1, బీబీపేటలో 1 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

సర్దుబాటు ఉత్తమాటేనా?

జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో ఇప్పటికీ చాలా పాఠశాలల్లో సర్దుబాటు చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. కనీసం ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండే పాఠశాలలో సర్దుబాటు చర్యలు చే పట్టడంలేదనే వాదన వినిపిస్తోంది. ఉపాధ్యాయులు లేని కారణంతో విద్యార్థులు సైతం సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. దీనికి కారణం ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం మరోవైపు విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయకపోవడమేనని తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కొంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటులో భాగంగా డిప్యూటేషన్‌ కింద ఆయా పాఠశాలలకు కేటాయించిన సదరు ఉపాధ్యాయులు వెళ్లడం లేదనే వాదన వినిపిస్తోంది. సదరు ఉపాధ్యాయులు విద్యాశాఖాధికారులను మచ్చిక చేసుకుని డిప్యూటేషన్‌పై కేటాయించిన పాఠశాల ముఖం చూడడం లేదు. క్షేత్రస్థాయిలో విద్యాశాఖాధికారులు పర్యవేక్షించకపోవడంతోనే సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో 856 టీచర్‌ పోస్టుల ఖాళీలు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో మొత్తం 1,078 వివిధ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులోని విద్యార్థులకు బోధించేందుకు జిల్లాకు 4,938 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 4,082 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. మిగితా 856 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌(గణితం 38, భౌతికశాస్తం 21, బయోసైన్స్‌ 68, సాంఘిక శాస్త్రం 140, ఇంగ్లీషు 39, పీఈటీలు 9, తెలుగు 32, హిందీ 29, ఉర్దూ 4, మరాటి 1), తెలుగు పండిత్‌ 15, ఎస్‌జీటీ పోస్టులు 478, పీఈటీ 8, ఎల్‌పీ హిందీ 37, ఎల్‌పీ ఉర్దు 1, ఎల్‌పీ మరాటి 3, ఇతర విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులు 6 ఉన్నాయి. వీటితో పాటు జీహెచ్‌ఎం గ్రేడ్‌ 3 పోస్టులు 114 ఖాళీగా ఉండగా, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 103 కూడా ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒక ఎస్‌జీటీకి సంబంధించిన పోస్టులు మినహా మిగిలిన అన్ని పోస్టులను ప్రమోషన్ల ద్వారా నింపగా మిగిలిన వాటిని భర్తీ చేయనున్నట్లు సంబంధితశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-08-04T00:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising