ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో పైరవీలు!

ABN, First Publish Date - 2023-09-14T00:04:39+05:30

విద్యాశాఖలోని బదిలీలు, పదోన్నతులకు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడం, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుండడంతో కొందరు ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార పార్టీ నేతలతో అనుకున్న పాఠశాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు విద్యాశాఖలో చర్చ సాగుతోంది.

- పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్యవర్తిత్వం

- అధికార పార్టీ నేతల పరపతితో అనుకున్న చోటుకు పోస్టింగ్‌లు

- పైరవీలు మొదలుపెట్టిన పలు సంఘాల నేతలు

- అనుకున్న స్థానం కోసం చూపుతున్న అనారోగ్య కారణాలు

- విద్యాశాఖ అధికారుల తీరుపైౖ ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు

- నిబంధనల ప్రకారం బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదంటూ పలువురు ఉపాధ్యాయులు

- సామాన్య టీచర్లకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన

- ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు ఆస్కారం

కామారెడ్డి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలోని బదిలీలు, పదోన్నతులకు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడం, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుండడంతో కొందరు ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార పార్టీ నేతలతో అనుకున్న పాఠశాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు విద్యాశాఖలో చర్చ సాగుతోంది. ప్రధానంగా పలు పలుకుబడి ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ రాజకీయం కొనసాగించుకునేందుకు తమ వ్యాపారాలను నడుపుకునేందుకు తమకు నచ్చిన పోస్టింగ్‌ల కోసం ఇప్పటి నుంచే పైరవీలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మొదలుకొని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ కార్యాలయంలోనే తిష్టవేయడం ఇందుకు నిదర్శనం. దీనికి తోడు కొందరు ఉపాధ్యాయులు బదిలీల ప్రాధాన్యత కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీల నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుని లేని అనారోగ్య సమస్యలను కారణంగా చూపుతూ తప్పుడు సర్టిఫికెట్లతో దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది. సీనియార్టీ జాబితాలోను నిబంధనలు పాటించడం లేదని పలు ఉపాధ్యాయుల సంఘాలు విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయిలోని ఓ ఉపాధ్యాయ సంఘనేతతో పాటు మరో పేరున్న ప్రజాప్రతినిధి రిఫరెన్స్‌తో అనుకున్న స్థానానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపడుతామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నప్పటికీ పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకే అనుకున్న చోటుకు బదిలీ చేస్తు పైరవీలు సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వెల్లువెత్తిన అభ్యంతరాలు

జిల్లా విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకై 3300లకు పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఇది వరకే ముగిసింది. సీనియార్టీ జాబితాను సైతం విద్యాశాఖ అధికారులు కార్యాలయంలో పొందుపరిచారు. దీనిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన జాబితాపై ఉపాధ్యాయుల నుంచి భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. మొత్తం 310కి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. అంటే బదిలీలు, పదోన్నతుల నిబంధనలు ఉల్లంఘించి జాబితాను ప్రదర్శించారని పైరవీలు చేసే ఉపాధ్యాయులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

సీనియార్టీ జాబితాపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి

జిల్లా విద్యాశాఖలో ప్రదర్శించిన సీనియార్టీ జాబితాలోని తప్పులను ఎత్తిచూపుతూ ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎం పదోన్నతుల లిస్టులో డేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ అపాయింట్‌మెంట్‌ జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్పౌజ్‌ కేటగిరిలో జీహెచ్‌ఎం 5 సంవత్సరాలు, సాట్‌ 8 సంవత్సరాల నిబంధన ఉల్లంఘించి 5 సంవత్సరాలలో స్పౌజ్‌ పాయింట్‌ వాడుకుని మరల తన భార్య సాట్‌కి వాస్తవానికి 8 సంవత్సరాల అనంతరం స్పౌజ్‌ పాయింట్‌లు ఉపయోగించాలి కానీ ఆ నిబంధనలను ఉల్లంఘించి జాబితాలో చేర్చారు. పదోన్నతులు, సీనియార్టీ జాబితాలో అనేక తప్పులు దొర్లాయని 317 జీవోలో జిల్లాకు అలర్ట్‌ అయిన ఉపాధ్యాయులకు తక్కువగా పాయింట్‌లు ఇస్తున్నారని వాటిని సవరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులకు వెరిఫికేషన్‌కు రాని, తిరస్కరించిన వారిని కటాఫ్‌ కంటే ముందున్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. సీనియార్టీ జాబితాలో వికలాంగుల కోటాలో 70 శాతం లేని వారి పేర్లను కూడా ప్రిపరెన్షియల్‌ కేటగిరీలో చేర్చారని మండిపడుతున్నారు. బదిలీల దరఖాస్తులను తెలుగు మీడియం బదులు ఇంగ్లీషు మీడియం పెట్టిన ఉపాధ్యాయులను తెలుగు మీడియం జాబితాలో వారి పాయింట్లతో సంబంధం లేకుండా ముందుకు తీసుకువచ్చారని, గ్రివెన్స్‌సెల్‌లో చేర్చించిన అభ్యంతరాలను పరిష్కరించి సీనియార్టీ జాబితాను సవరించాలని డీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

అదనపు పాయింట్ల కోసం అడ్డదారులు

ఉపాధ్యాయ బదిలీల్లో ప్రాధాన్యత పాయింట్‌లు సంపాదించుకునేందుకు కొందరు అడ్డదారులు వెతికారు. అనారోగ్య కారణాలను చూపుతూ లేని రోగాలను ఉన్నట్లు వైద్య సర్టిఫికెట్లు సంపాదించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నకిలీ వైద్య పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వారిపైనే చిన్నపిల్లలు ఆధారపడి ఉంటే డిపెండెంట్‌ కింద ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఉపాధ్యాయులు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుని అధిక పాయింట్లు పొంది అనుకున్న పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఓ ఉపాధ్యాయునికి గతంలో 40 శాతం అంగవైకల్యం ఉన్నట్లు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వగా ప్రసుత్తం అదే ఉపాధ్యాయునికి 70 శాతం అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌ తీసుకువచ్చారని, మరో ఉపాధ్యాయుడు నరాలకు సంబంధించిన సర్జరీ ఉంటేనే ప్రభుత్వ సడలింపులను వినియోగించాల్సి ఉండగా కేవలం నరాలకు సంబంధించిన చిన్నపాటి సమస్య ఉన్న ప్రభుత్వ సడలింపులను యథేచ్ఛగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు పలువురు ఉపాధ్యాయులు వినిపిస్తున్నారు. దీంతో వాస్తవంగా ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఎదురవుతోంది. జిల్లా విద్యాశాఖాధికారులు వీటన్నింటిని క్షుణంగా పరిశీలించి బదిలీల ప్రక్రియ చేపట్టాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అనుకున్న పొస్టింగ్‌కు లక్షలు కుమ్మరిస్తున్న పంతులు

ప్రభుత్వ పాఠశాలలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యా బోధనలు చెప్పాల్సిన బడి పంతులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. తమ సైడ్‌ బీజినెస్‌లు నడిపించేందుకు మారుమూల గ్రామాల్లో కాకుండా పట్టణ, మండల కేంద్రాల్లో పోస్టింగ్‌లు చేయించుకునేందుకు లక్షల రూపాయాల్లోనే పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత మూడున్నర ఏళ్లుగా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వం చేపట్టలేదు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇదేఅదనుగా భావించిన కొందరు ఉపాధ్యాయులు ప్రధాన సంఘాల ముసుగులో పలు కార్యక్రమాలు చేపడుతుంటామని తమకు పట్టణ, మండల కేంద్రాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలతో జోరుగా పైరవీలు కొనసాగిస్తున్నారు. సంఘాల నేతల పైరవీల ఉంటే మరికొందరు ఉపాధ్యాయులు లక్షల రూపాయలు ఖర్చు చేసైనా తమకు అనుకున్న స్థలానికి పోస్టింగ్‌ తెప్పించుకునేందుకు సీఎంవో కార్యాలయంలోనే పైరవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-14T00:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising