ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందని పంట రుణం

ABN, First Publish Date - 2023-02-24T00:58:03+05:30

జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగినా పంట రుణాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాల పంపిణీ జరగలేదు. రుణ పంపిణీ గడువు ముగుస్తున్నా కొన్ని బ్యాంకులు లక్ష్యాలను చేరుకోవడంలేదు. బ్యాంకర్ల కమిటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రుణాలను ఇవ్వడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ముగుస్తున్న గడువు

టార్గెట్‌కు అనుగుణంగా అందని పంట రుణాలు

ఇప్పటి వరకు 47శాతం మాత్రమే పంపిణీ

గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగినా పంట రుణాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాల పంపిణీ జరగలేదు. రుణ పంపిణీ గడువు ముగుస్తున్నా కొన్ని బ్యాంకులు లక్ష్యాలను చేరుకోవడంలేదు. బ్యాంకర్ల కమిటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రుణాలను ఇవ్వడంలేదు. జిల్లాలో ఇప్పటి వరకు టార్గెట్‌లో 47శాతం వరకే పంట రుణాలను అందించారు. కలెక్టర్‌తో సహా అధికారులు ఎన్నిమార్లు సమీక్షించినా ఇప్పటి వరకు రుణ పంపిణీ మాత్రం పెరగడంలేదు. గడువు ముగిసేందుకు ఇంకా నెలరోజులే సమయం ఉండడంతో అధికారులు రుణ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ, బ్యాంక్‌ అధికారుల సమన్వయంతో రుణ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీగా పంటల సాగు

జిల్లాలో యాసంగిలో భారీగా పంటల సాగైంది. నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు బోర్ల కింద రైతులు ఈ పంటలను వేశారు. జిల్లాలో సుమారు 5లక్షల ఎకరాల్లో పంటలను సాగుచేశారు. మొత్తం పంటల సాగులో 3లక్షల 95వేల ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేశారు. మిగతా పంటల కంటే వరి పంటనే ఎక్కువగా వేశారు. మొత్తం విస్తీర్ణంలో 70 శాతానికి పైగా ఈ పంటను వేశారు. ఇవేకాకుండా మొక్కజొన్న, ఎర్ర జొన్న, పొద్దుతిరుగుడుతో పాటు ఇతర పంటలను వేశారు. రైతులు ఆరుతడి పంటలకు పెట్టుబడి తక్కువగా పెట్టిన వరి పంటకు మాత్రం ఎక్కువ మొత్తంలో పెడుతున్నారు. దిగుబడి పెరుగుతుండడం వల్ల ప్రతి సంవత్సరం పెట్టుబడి కూడా పెరుగుతుంది. నారుపోసినప్పటి నుంచి నాట్లు, దున్నడం, కలుపు, ఎరువులు కలిపి ఎకరాకు 30వేల వరకు ఖర్చుచేస్తున్నారు. దిగుబడి పెరగడం, మద్దతుధర క్వింటాల్‌ 2060 రూపాయలు ఉండడంతో ఎక్కువ మొత్తంలో ఈ వరిసాగు చేశారు. వేసిన పంటలో సన్న రకాలే 60శాతంకుపైగా సాగు చేశారు.

రూ.1538. 50 కోట్లు అందించాలని నిర్ణయం

జిల్లాలో ఈ యాసంగిలో రైతులను ఆదుకునేందుకు పంట రుణాలను ఇవ్వాలని అక్టోబరులో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ యాసంగిలో 1538. 50 కోట్ల రూపాయలు అందించాలని నిర్ణయించారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలను ఇచ్చారు. నవంబరు నుంచి మార్చి వరకు ఈ పంట రుణాలను పంపిణీ చేయాలని కోరారు. రైతులకు నాట్లు ఎక్కువగా ఉండే సమయం డిసెంబరు, జనవరి నెలల్లోనే పంట రుణాలను ఎక్కువగా అందించాలని బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం రైతులకు రుణ పంపిణీ చేయలేదు.

ఇప్పటి వరకు రూ.726.36 కోట్లు పంపిణీ

జిల్లాలో ఇప్పటి వరకు 726.36 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించారు. నిర్ణయించిన లక్ష్యంలో 47 శాతమే పూర్తిచేశారు. పంట రుణ పంపిణీకి ఇంకా నెలరోజులే సమయం ఉన్న బ్యాంక్‌ అధికారులు మాత్రం లక్ష్యాలను చేరుకోలేదు. పంటలు వేయడం, ప్రస్తుతం పొట్టదశలో ఉండడం, బ్యాంకుల నుంచి రుణ పంపిణీ అంతగా లేకపోవడంతో రైతులు ఎక్కువగా ఇతర వ్యక్తుల నుంచి పెట్టుబడికి అవసరమైన డబ్బును తీసుకుంటూ పంటలను సాగుచేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లే రైతులు పాత రుణాలను చెల్లించి కొత్తవి తీసుకుంటున్నారు. మరికొంతమంది రైతులు రుణాలను రీషెడ్యూల్‌ చేసుకుని స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం మిగతా డబ్బులను తీసుకుంటున్నారు. బ్యాంకు అధికారులు సరైన విధంగా స్పందించకపోవడం, రైతులు వెళ్లిన సమయంలో వాయిదాలు వేయడం, తిప్పడం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ యాసంగిలో బ్యాంకుల వద్దకు రావడంలేదు. తక్షణ అవసరాలకు వడ్డీకి తె చ్చుకుని ఈ పంటల సాగు చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు బ్యాంకర్లతో సమీక్షించి రుణ పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రుణాలను అందించాలని కోరారు. జిల్లాలో బ్యాంకుల లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా గడువు ముగిసేలోపు రైతులకు రుణ పంపిణీ జరిగేవిధంగా చూస్తామన్నారు. తక్కువగా రుణాలు ఇచ్చిన బ్యాంకులపైన ఫోకస్‌పెంచి రైతులకు ఎక్కువ రుణాలు అందేవిదంగా చూస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-24T00:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising