ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎంఆర్‌.. లక్ష్యం చేరేనా?

ABN, First Publish Date - 2023-09-01T00:13:21+05:30

జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్‌ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు సైతం జారీ చేసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం అప్పగించాల్సిందేనని అందులో పేర్కొంది.

- జిల్లాలో సీఎంఆర్‌ లక్ష్యం చేరని మిల్లులు

- ఇప్పటికీ ప్రభుత్వానికి చేరని కస్టం మిల్లింగ్‌ రైస్‌

- రెండు సీజన్‌లకు సంబంధించి ధాన్యం మిల్లుల్లోనే..

- కస్టం బియ్యం ఇవ్వడంలో సాకులు చెబుతున్న మిల్లర్లు

- గోడౌన్‌లు ఖాళీ లేవంటూ సాకులు

- జిల్లాలో 136రా.. మరో 35 బాయిల్డ్‌ రైసుమిల్లులు

కామారెడ్డి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్‌ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు సైతం జారీ చేసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం అప్పగించాల్సిందేనని అందులో పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచింది. అయినప్పటికీ కొన్ని మిల్లుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున బియ్యం బకాయి పడ్డాయి. ఇలా జిల్లాలో సీఎంఆర్‌ను మిల్లుల నుంచి సేకరించడంలో అధికారులు సీరియస్‌ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి సీఎంఆర్‌ను కేటాయించడంలో మిల్లర్లు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గోదాంలు ఖాళీ లేకపోవడంతో సీఎంఆర్‌ ఇవ్వడం లేదనే పలు సాకులు చెబుతున్నారు.

జిల్లాలో 179 రైసుమిల్లులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 179 రైసుమిల్లులు ఉన్నాయి. ఇందులో 136 రా రైసుమిల్లులు ఉండగా మరో 35కి పైగా బాయిల్డ్‌ రైసుమిల్లులు ఉన్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 557 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీనెల పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2.46లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతినెల 5,450 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీకి ప్రతీ ఏటా రెండు సీజన్‌లలో రైతులు పండించే ధాన్యాన్ని రైసుమిల్లుల్లో మర ఆడించి బియ్యంగా మార్చి పేదలకు పంపిణీ చేస్తుంటారు.

రెండు సీజన్‌ల సీఎంఆర్‌ మిల్లుల్లోనే..

జిల్లాలో రెండు సీజన్‌లకు సంబంధించి ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. జిల్లాలో 2022-23లో వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి 4.75లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయా రైసుమిల్లులకు కేటాయించారు. రైసుమిల్లర్లు మిల్లింగ్‌ చేసి తిరిగి ప్రభుత్వానికి 3.17 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 77,581 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. మరో 2.39 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి 3,64,973 మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి మిల్లులకు కేటాయించారు. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్‌ కింద తిరిగి ప్రభుత్వానికి 2.44 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 17,784 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించారు. మరో 2.26 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లుల వద్దే ఉంది. ఇలా జిల్లాలోని ఆయా రైసుమిల్లుల నుంచి 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.

ఈనెల చివరి కల్లా ముగియనున్న గడువు

2022-23 వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని పలు రైసుమిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్‌ కింద 3.17 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 77,581 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చినట్లు సివిల్‌సప్లయ్‌ అధికారులు చెబుతున్నారు. మరో 2.39 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం వచ్చేది ఉందని ఈనెల చివరి వరకు ఇవ్వాలని ప్రభుత్వం మిల్లర్లకు గడువు ఇచ్చింది. అయితే ఈ గడువు లోపు మిల్లర్ల నుంచి ఇంకా బియ్యం అందిస్తారో లేదో చూడాలి. సకాలంలో సీఎంఆర్‌ను అందించని పలు రైసు మిల్లు యజమానులకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే గడువు ముగిసిన సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. వానాకాలం సీజన్‌దే కాకుండా యాసంగి సీజన్‌కు సంబంధించి బియ్యం కూడా పూర్తిస్థాయిలో మిల్లర్ల నుంచి రాలేదు.

వానాకాలం సీఎంఆర్‌ ఆలస్యంపై మిల్లులపై ఒత్తిడి

గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ గడువు ఇది వరకే ముగిసింది. అయితే మిల్లుల యాజమాన్యాలు కోరిన నేపథ్యంలో పలుమార్లు గడువును పొడిగించారు. గత యాసంగి సీజన్‌కు కూడా గడువు దగ్గర పడుతోంది. అయితే దీనికి మరోమారు పెంచేందుకు అవకాశం ఉండడంతో మిల్లుల యాజమాన్యాల జోలికి వెళ్లడం లేదని సివిల్‌ సప్లయ్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గోదాంలు ఖాళీ లేకపోవడం సీఎంఆర్‌తో నిండుగా ఉండడంతో మిల్లర్లు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మిల్లులకు కేటాయింపు, వాటిని తిరిగి ఎఫ్‌సీఐ సేకరణ ప్రారంభంలో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో సీఎంఆర్‌ అప్పగించడానికి కొందరు వెసులుబాటు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ వానాకాలం విషయంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు.

Updated Date - 2023-09-01T00:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising