ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Political Power : తెలంగాణపై ఎన్టీఆర్‌ చెరగని ముద్ర

ABN, First Publish Date - 2023-05-28T03:45:37+05:30

నటుడిగానే కాక.. పాలనా సంస్కరణల ద్వారా బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్‌.. తెలంగాణపై చెరగని ముద్ర వేశారు! ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల చెంతకు రాజకీయాలు.. పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు వెనుకబడిన వర్గాల వారికి అండగా టీడీపీ.. రాజకీయ అధికారం

నటుడిగానే కాక.. పాలనా సంస్కరణల ద్వారా బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్‌.. తెలంగాణపై చెరగని ముద్ర వేశారు! ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు పేదలకు, రైతాంగానికి వరంలా మారాయి. మరీ ముఖ్యంగా.. పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దుతో ప్రజలు, రైతాంగం ఊపిరిపీల్చు కున్నారు. అంతేకాదు.. అప్పటిదాకా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నిర్మించి, ఎంతో మంది బీసీలు, ఎస్సీలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారు. రాజకీయాలను ప్రజల చెంతకే తీసుకొచ్చారు.

(హైదరాబాద్‌–ఆంధ్రజ్యోతి)

ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చేనాటికి.. ఊళ్లో పెద్దమనిషి ఎవరికి వేయాలని చెబితే వారికే ఓట్లు వేసే పరిస్థితి ఉండేదని, దొరల ఇళ్లకు, వాడలకు మాత్రమే రాజకీయాలు పరిమితమయ్యేవని.. ఎన్టీఆర్‌ వచ్చాక ఆ పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అలాగే.. ఉమ్మడి రాష్ట్రంలో తాలుకా వ్యవస్థ స్థానంలో మండలాలను ఏర్పాటు చేసి అందులో ఉన్న రిజర్వేషన్లను ఎన్టీ రామారావు పెంచి, కొనసాగించారు. దాంతో స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ నాయకత్వం బలపడింది. ఆ వర్గాల నుంచి పలువురు నాయకులుగా ఎదిగారు. అలా కొత్త నాయకులు రావడానికి ఎన్టీఆర్‌ దోహదం చేశారు.

విప్లవాత్మక మార్పు..

తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన కాలం నుంచి పటేల్‌, పట్వారీ వ్యవస్థ ఉండేది. వీరంతా జమీందార్లు, జాగీర్‌దార్లకు విధేయులుగా ఉండేవారు. గ్రామంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ పట్వారీలకు కంఠోపాఠంగా ఉండేవి. దాంతో వీరు విపరీతమైన అధికారాలను, పెత్తానాన్ని చెలాయించేవారు. ఆ కారణంగా పల్లెల్లో రైతులంతా వీరి కనుసన్నలో మెలిగేవారు. ఇంకా చెప్పాలంటే గజగజలాడేవారు. రైతాంగాన్ని బాగా ఇబ్బందులు పెట్టేవారు. వేధింపులకు గురి చేసేవారు. బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. దీంతో ఈ వ్యవస్థపై ప్రజలకు బాగా కోపం ఉండేది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణ ప్రాంతంలో 16,346 మంది ఈ వ్యవస్థలో ఉండేవారు. ప్రజలను పీడిస్తున్న ఈ పటేల్‌, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ ఒక్క కలంపోటుతో రద్దు చేసి.. వారి స్థానంలో 5,175 మంది పూర్తి కాల గ్రామ సహాయకులను (ఫుల్‌టైమ్‌ విలేజ్‌ అసిస్టెంట్స్‌) తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఎన్టీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. కొందరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఎన్టీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు సరికదా.. దాన్ని విప్లవాత్మకమైన మార్పుగా దేశమంతా కొనియాడింది.

రాజకీయంగా ఎదిగిన బీసీలు..

భూసంస్కరణలతో భూపంపిణీ జరగడంతో కొద్దోగొప్పో వచ్చిన భూమిని తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాలు సాగు చేయడం ప్రారంభించారు. దొరల దగ్గరకు పనికి వెళ్లడాన్ని మానుకున్నారు. దీంతో గ్రామాల్లో ఒక ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకుంది. దీన్ని పరిష్కరించే దిశగా నక్సల్బరి ఉద్యమం పుట్టుకొచ్చింది. అదే సమయంలో.. పల్లెల్లో కంటే పట్టణాలకు వెళితే ఉపాధి దొరకడంతో పాటు డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే అభిప్రాయం పెరిగింది. అలా బడుగు, బలహీనవర్గాల్లోని కొంతమంది ఆర్థికంగా ఎదిగారు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు గెలిచారు. సరిగ్గా అటువంటి సమయంలోనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో వారంతా టీడీపీ అండతో ప్రత్యక్ష రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ వీరికి ఒక వేదికగా మారింది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్స్‌ను 20 శాతానికి, మహిళా రిజర్వేషన్లకు 9 శాతానికి పెంచారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయం బీసీలకు బాగా కలసివచ్చింది. వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. దాంతో తెలంగాణలో ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే రాజకీయాలు మారిపోయాయని.. అప్పటివరకు కొంతమంది పెద్దమనుషులకే పరిమితమైన రాజకీయాలు బడుగు, బలహీన వర్గాల చెంతకు చేరాయనే భావన, ఎన్టీఆర్‌ వల్లే తమకు రాజకీయాల్లో స్థానం కలిగిందన్న భావన బీసీల్లో బలంగా ముద్రపడింది.

Updated Date - 2023-05-28T03:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising