వనమాకు మరొకసారి హైకోర్టులో చుక్కెదురు...
ABN, First Publish Date - 2023-07-27T13:56:12+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు సమయం కోరుతూ వనమా వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు సమయం కోరుతూ వనమా వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తన దరఖాస్తులో తెలిపారు. సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకూ అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా.. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-07-27T13:56:12+05:30 IST