ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apsara Murder Case : ఢిల్లీ నుంచి గల్లీ దాక సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులందరికీ సహకారం అందించింది ‘ఒక్కరే’..!

ABN, First Publish Date - 2023-06-11T03:22:15+05:30

ప్రత్యర్థిని హత్య చేయాలంటే గతంలో సుపారీ గ్యాంగ్‌, రౌడీ ముఠాల్ని ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మనిషిని చంపడమెలా!

  • ఆధారాలు దొరక్కుండా ఏం చేయాలి?..

  • ఆన్‌లైన్‌లో వెతికి మరీ కర్కశంగా హత్యలు

  • ఆన్‌లైన్‌ కంటెంట్‌పై పోలీసుల నియంత్రణ కరువు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నుంచి గల్లీ దాక సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులందరికీ సహకారం అందించింది ఒక్కరే..! హత్య చేయడం ఎలా..? ఆధారాలు దొరక్కుండా శవాన్ని ఎలా మాయం చేయాలి..? ఇలాంటి ప్రశ్నలు అడిగిన వెంటనే ఫింగర్‌ టిప్స్‌ మీద హంతకులకు సమాచారం అందింది. అంతే.. మరో ఆలోచన లేకుండా అ నుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి హత్యలకు సహకారం అందిస్తోంది.. ఆజ్యం పోస్తోంది.. మరెవరో కాదు టెక్నాలజీనే..! స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడం, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండటంతో మంచి, చెడు.. దేనికైనా అందులోనే వెతికేస్తున్నారు. అనుకున్న ప్రకారం పథకం అమలు చేస్తున్నారు. ప్రత్యర్థిని హత్య చేయాలంటే గతంలో సుపారీ గ్యాంగ్‌, రౌడీ ముఠాల్ని ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో సెర్చ్‌ చేస్తూ సైలెంట్‌గా దారుణాలకు ఒడిగడుతున్నారు.

అన్ని హత్యల్లోనూ అదే తీరు..

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌ పునావాలా.. శ్రద్ధా వాకర్‌ను చంపాక ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపర్చాడు. ఇంట్లో హత్య ఆనవాళ్లు దొరక్కుండా చేసేందుకు ఏం చేయాలని ఇంటర్నెట్‌లో వె తికినట్లు పోలీస్‌ విచారణలో తేలింది. సల్ఫర్‌ హైపోకెలోరిక్‌ యాసిడ్‌ గురించి ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకుని కొనుగోలు చేసి ఆధారాలు చెరిపేశాడు.

  • ఇటు హైదరాబాద్‌ నగర శివారులో ఇంజనీరింగ్‌ విద్యార్థి నవీన్‌.. అతడి స్నేహితుడు హరిహర కృష్ణ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. నవీన్‌ శరీర భాగాల్ని చూసిన పోలీసులు కచ్చితంగా ఇది ఒక్కరు చేసిన పనికాదని అంచనాకు వచ్చేంత కర్కశంగా హతమార్చాడు. హత్యకు ముందు సమాచారం కోసం హరిహర కృష్ణ ఇంటర్నెట్‌లో వెతికినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

  • కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన హెడ్‌ నర్సు అనురాధ రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సహజీవనం చేస్తున్న చంద్రమోహన్‌ ఆమెను ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చాడు. మొండెం నుంచి తల వేరుచేసి, శరీర భాగా ల్ని ముక్కలు చేశాడు. మూడో కంటికి తెలియకుండా ఆ శరీర భాగాల్ని మాయం చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. ఆమె శరీర భాగాల్ని ముక్కలు చేసేందుకు చంద్రమోహన్‌ ఇంటర్నెట్‌ను సెర్చ్‌ చేసి.. రాళ్లను కోసే యంత్రం తెచ్చినట్లు విచారలో తేలింది.

  • ఇక తాజాగా హైదరాబాద్‌లోనే జరిగిన అప్సర హత్య కేసులోనూ ఇదే జరిగింది. అప్సరను దారుణంగా హత్య చేసిన పూజారి సాయికృష్ణ.. ఆమె శవాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. అయితే అతడు కూడా కొద్ది రోజులుగా హత్యకు అవసరమైన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఒక వ్యక్తిని ఎలా హత్య చేయాలి? శవాన్ని ఎలా మాయం చేయాలి? ఆధారాలు దొరక్కుండా ఏం చేయాలి? ఇలాంటి సమాచారం ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా ఉంది. టెక్ట్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలతో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతోంది. హింసకు ప్రేరేపించే ఆన్‌లైన్‌ కంటెంట్‌పై పోలీసులకు నియంత్రణ లేకపోవడంతో దాన్ని తొలగించలేకపోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయా కేసులకు సం బంధించి హింసాత్మక కంటెంట్‌పై పోలీసులు సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖ రాస్తారు. సదరు హింసాత్మక కం టెంట్‌ తొలగించాలని కోరతారు. అంతే తప్ప మరేమీ చేసే పరిస్థితి లేదు. ఇంటర్నెట్‌లో హింసను ప్రొత్సహించే కంటెంట్‌పై ఎలాంటి నిషేధం లేకపోవడం సమస్యకు అసలు కారణంగా మారుతోంది.

‘స్క్రిప్ట్‌ కిడ్డీస్‌’గా సమాచార సేకరణ..

‘‘గతంలో ఏదైనా సమాచారం కావాలంటే వాయిస్‌ రూపంలో లభించేది. కానీ ఇప్పుడు కళ్లకు కట్టినట్లు ఆడియో, వీడియో రూపంలో ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు మరింతగా తెగబడుతున్నారు. నేరం ఎలా చేయాలని ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకునే వాళ్లను టెక్నికల్‌ పరిభాషలో స్క్రిప్ట్‌ కిడ్డీస్‌ అంటారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు, నిషేధిత పదాల్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే వెంటనే నిఘా సంస్థలకు అలర్ట్‌ వెళ్తుంది. అదే తరహాలో హత్యలు, హింసకు సంబంధించిన సమాచారం వెతికినా దర్యాప్తు సంస్థలకు అలర్ట్‌ వెళ్లే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. ప్రిడెక్టివ్‌ పోలీసింగ్‌ ద్వారా భవిష్యత్‌ నేరాల్ని అంచనా వేసి అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాలి’’ అని సైబర్‌ ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల అన్నారు.

Updated Date - 2023-06-11T08:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising