ponguleti: నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర
ABN, First Publish Date - 2023-11-25T13:45:08+05:30
‘పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. అనేకమంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దోపిడీ,
- గడీల పాలనకు ప్రజలు తెరదించాలి
- అభివృద్ధిలో పాలేరును నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా
- కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- తిరుమలాయపాలెం, నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారం
ఖమ్మం: ‘పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. అనేకమంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దోపిడీ, దొరల పాలన కొనసాగుతోంది. గడీల పాలనకు ప్రజలు తెర దించాలి. సుస్థిరపాలన అందించే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని’ పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) పేర్కొ న్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం, నేలకొండపల్లిలో ఆయన ప్రచారం చేశారు. రమణతండా, బీసరాసిపల్లి, బలరాం తండా, వెదుళ్ల చెరువు, బా లాజీనగర్‌తండా, గువ్వలగూడెంతో పాటు నేలకొండపల్లి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నేలకొండపల్లి పీఎస్సార్ సెంటర్‌లో ఎన్ని కల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం సాధ న కోసం సుమారు 1200 మది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. రాష్ట్రంకోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను సీఎం కసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనకోసం ప్రతి గుండె పరితపిస్తుందని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అచాచకపాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు వారి కుటుంబాలన సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన, దోపిడీ పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్ ను గద్దెదించేందుకు ప్రతీ ఒక్కరు కంకణబద్ధులు కావాలని కోరారు. పదేళ్లలో దోచుకుని దాచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, రేవంత్‌రెడ్డిని, నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగం గానే స్థానిక ఎమ్మెల్యేకు రూ.300కోట్లు పంపించారని, తెలిపారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్, ఆయన కుటుంబం ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకుతింటున్నదన్నారు. దొరను గడీలోనే బంధించి రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలని పిలుపునిచ్చారు. దొరల పాలనలో దగాపడి, మోసపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, పేదలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు. తనను, రేవంత్‌రెడ్డిని ఓడించటానికి కోట్ల డబ్బులు పంపిస్తున్నాడన్నారు. కేసీఆర్ పంచే డబ్బు మనదే.. ఆ డబ్బు తీసుకుని ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు.
తిరుమలాయపాలేన్ని దత్తత తీసుకుంటాను
తనను గెలిపిస్తే తిరుమలాయపాలెం మండలాన్ని దత్తత తీసుకో వడంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. తనను ఈఎన్నికల్లో గెలిపిస్తే పాలేరు నియో జకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు పాలేరు నియోజకవర్గంలోని సమస్యలపై తనకు పూర్తి అవగా హన ఉందని, వీటిని పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకిపెట్టని కోటని, ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డికి భంగపాటు తప్పదన్నారు. కందాళ ఉపేందర్‌రెడ్డి ఈప్రాంత ప్రజలకు చేసిం దేమీలేదన్నారు. కేవలం హడావుడి పర్యటనలు తప్ప ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే నెపంతో కన్నీరు కారు స్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రామసహా యం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, ఎంపీపీ బోడ మంగిలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీను, మోహన్, రాంబాబు, సైదులు, మాజీ సర్పంచ్ కైకా, టీడీపీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్, టీడీపీ మండలాధ్యక్షడు నామా ప్రసాద్, మద్దినేని మధు, నేలకొండపల్లిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలకు చెందిన రాయల నాగేశ్వరరావు, బొడ్డు బొందయ్య, వజ్జా రమ్య, వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, చెరువు స్వర్ణ, బచ్చలకూరి నాగరాజు, మామిడి వెంకన్న, గోళ్ళ శ్రీనివాసరావు, జెర్రిపోతుల అంజని, నెల్లూరి భధ్రయ్య, ఆరెకట్ల కొండలరావు, నలమాస మల్లయ్య, వీసం శ్రీను, తాటికొండ నాగేశ్వరరావు, కర్నాటి భానుప్రసాద్, మచ్చా రఘుపతిరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-25T13:45:10+05:30 IST