పొట్టి శ్రీరాములు పోరాటం స్ఫూర్తిదాయకం
ABN, Publish Date - Dec 15 , 2023 | 11:22 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రసాధన కోసం పొట్టి శ్రీరాములు పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్నారు.
కోదాడటౌన / నడిగూడెం / నేరేడుచర్ల, డిసెంబరు 15 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రసాధన కోసం పొట్టి శ్రీరాములు పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. న్యాయమైన హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ పైడిమర్రి సత్తిబాబు, గరిణే కోటేశ్వరరావు, గరిణే శ్రీధర్, ఓరుగంటి ప్రభాకర్, రాయపూడి వెంకటనారాయణ, తెల్లాకుల వెంకటేశ్వర్లు, పందిరి సత్యనారాయణ, యాద సుధాకర్, పబ్బా గీత, హుస్సేనరావు, బండారు శ్రీను, సాయి, చల్ల ప్రకాష్ పాల్గొన్నారు. నడిగూడెంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ చిల్లంచర్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్, కొల్లు పుల్లయ్యచౌదరి, ఎస్‌కే జలీల్, వెంకటేష్, గోవర్ధన, సాయిప్రకాష్ పాల్గొన్నారు. నేరేడుచర్లలో వాసవీ, వనితా క్లబ్ ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయయా క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్, వీరవెల్లి శ్రీలత, రాచకొండ శ్రీనివాసరావు, పొలిశెట్టి సంధ్య, నటరాజు, రాంమ్మూర్తి, కోటేశ్వరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2023 | 11:22 PM