Etaala: కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు.. కర్రుకాల్చి వాత పెట్టే రోజు వస్తోంది
ABN, First Publish Date - 2023-09-29T19:27:30+05:30
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనPrime (Minister Narendra Modi's visit) , సభ ఏర్పాట్లను బీజేపీ ఎంపీ అర్వింద్, బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) పరిశీలించారు.
నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన (Prime (Minister Narendra Modi's visit) , సభ ఏర్పాట్లను బీజేపీ ఎంపీ అర్వింద్, బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) పరిశీలించారు. ఎన్టీపీసీలో కొత్తగా ఏర్పాటు చేసిన రూ. 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. నిజామాబాద్ సభకు లక్షన్నర వరకు జన సమీకరణ చేయనున్నారు.
"వేల కిలో మీటర్ల రహదారులు నిర్మించాం. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి పనుల కోసమే మోదీ తెలంగాణకు వస్తున్నారు. రాజకీయాల కోసం కాదు. 3 వేల కి.మీ.ల జాతీయ రహదారుల నిర్మాణం చేసి చరిత్ర బీజేపీది. హామీ ఇవ్వకున్నా రామగుండం కర్మాగారాన్ని పునరుద్ధరించారు. 800 మెగావాట్ల కేంద్రాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారంటే తెలంగాణ సమాజమే సిగ్గు పడుతోంది. పంచాయతీ భవనం మొదలు అన్నింట్లో కేంద్రం నిధులు ఉన్నాయి. కానీ మొత్తం నేనే ఇస్తున్నా అని ఇక్కడి కేసీఆర్ మోసం చేస్తున్నారు. మరోసారి కేసీఆర్ తెలంగాణను వచించే ప్రయత్నమే. కర్రు కాల్చి వాత పెట్టే రోజు వస్తుంది." అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. "లక్ష మందితో సభ నిర్వహిస్తాం. అధికారిక, పార్టీ కార్యక్రమాల కోసం రెండు వేడుకలు ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ వద్దన్న సీఎం కేసీఆర్... ఇప్పుడు ఫోటోలు పెట్టుకుంటున్నారు." అని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-29T19:30:08+05:30 IST