ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS first list: బీఆర్ఎస్‌లో సీటు ఫైటు..!

ABN, First Publish Date - 2023-08-21T02:10:10+05:30

వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇంకా ప్రకటించక ముందే ఆ పార్టీలో అగ్గి రాజుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు బదులు కొత్తవారికి టికెట్‌ ఇస్తున్నారంటూ పార్టీ ఇస్తున్న లీకులతో శ్రేణులు ఆందోళన బాట పడుతున్నాయి. మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా.. సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తున్నారంటూ భగ్గుమంటున్నాయి.

అభ్యర్థుల జాబితా రాక ముందే మంటలు

టికెట్‌ దక్కదనుకున్న వారి ఆందోళన బాట

పోటీదారు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చర్యలు

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ ఓ మహిళతో

సన్నిహితంగా ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో

కొత్తగూడెం టికెట్‌ వనమాకే అని ప్రచారం

గడపగడపకు పేరుతో రంగంలోకి డీహెచ్‌ గడల

భూపాలపల్లిలో టవర్‌ ఎక్కిన సిరికొండ వర్గం

వేములవాడలో చెన్నమనేనికి మద్దతుగా భేటీ

ఉప్పల్‌లో ఏకమైన రామ్మోహన్‌, సుభాష్‌రెడ్డి

లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా కవితను కలిసిన నేతలు

అంబర్‌పేట, మెదక్‌, నర్సాపూర్‌లలోనూ

బీఆర్‌ఎస్‌ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇంకా ప్రకటించక ముందే ఆ పార్టీలో అగ్గి రాజుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు బదులు కొత్తవారికి టికెట్‌ ఇస్తున్నారంటూ పార్టీ ఇస్తున్న లీకులతో శ్రేణులు ఆందోళన బాట పడుతున్నాయి. మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా.. సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తున్నారంటూ భగ్గుమంటున్నాయి. ఇలా ఆయా నేతల అనుచరులు నిరసనలు తెలపడం, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తుండగా.. వైరా నియోజకవర్గంలో ఇది విపరీత చర్యలకు దారితీసింది. ఈ సారి టికెట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు కాకుండా, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఖాయమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో మదన్‌లాల్‌ వర్గం నేతలు ఎమ్మెల్యే వర్గంపై మండిపడుతున్నారు. మదన్‌లాల్‌ ఫొటోలను మహిళ ఫొటోతో కలిపి మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్లలోనూ దీనిపై ఫిర్యాదులు చేశారు.

మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో మళ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకే టికెట్‌ ఖరారైందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారం చేసుకొమ్మని ఆయనకు చెప్పినట్టుగా వనమా వర్గీయులు చెబుతున్నారు. వనమా కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు ‘గడపగడపకు గడల’ పేరుతో ప్రచారంలోకి దిగారు. జీఎ్‌సఆర్‌ ట్రస్టు ద్వారా కొత్తగూడెంలో ‘నన్ను ఆశీర్వదించండి’ అంటూ ఇంటింటికీ తిరిగారు. ఇక ఇల్లెందు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే బానోతు హరిప్రియకు వ్యతిరేకంగా ఇల్లెందు మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అసమ్మతి గళం విప్పారు. హరిప్రియకు టికెట్‌ ఇవ్వొద్దని విలేకరుల సమావేశం నిర్వహించారు. దీంతో హరిప్రియ మునిసిపల్‌ కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఇక్కడినుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ పేరు తెరపైకి రావడంతో శ్రేణుల్లో టెన్షన్‌ నెలకొంది.


మధుసూదనాచారి కోసం టవర్‌ ఎక్కి..

భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఎమ్మెల్సీ మధుసూదనాచారికే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆదివారం ఆందోళనకు దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్‌ రానుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు యువకులు భూపాలపల్లిలో సెల్‌ టవర్‌ ఎక్కారు. మధుసూదనాచారికి అవకాశం ఇవ్వకపోతే అక్కడి నుంచి దూకేస్తామని హెచ్చరించారు. మరికొంత మంది కార్యకర్తలు, సిరికొండ అభిమానులు చౌరస్తాలో బైఠాయించారు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడైన మధుసూదనాచారిపై కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని సహించబోమని అన్నారు. ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే 200 మంది కార్యకర్తలం నామినేషన్లు వేసి పోటీ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అక్కడికి చేరుకొని టవర్‌ ఎక్కిన యువకులను కిందికి దింపి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని సర్వేల ప్రకారం ప్రకటించాలని మైనంపల్లి స్వచ్ఛద సంస్థ నాయకులు, మరి కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు రాందాస్‌ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ ముద్దు.. పద్మాదేవేందర్‌రెడ్డి వద్దూ.. అంటూ నినాదాలు చేశారు. మరోవైపు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్‌ రాకపోతే తాము పార్టీలోనే ఉండబోమంటూ పలువురు నాయకులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు.

అంబర్‌పేట టికెట్‌ వెంకటేశ్‌కు ఇవ్వొద్దు

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ను సిటింగ్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు ఇవ్వవద్దంటూ నియోజకవర్గానికి చెందిన నలుగురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నేతలు, ఉద్యమకారులు ఆదివారం బాగ్‌అంబర్‌పేటలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఈసారి టికెట్‌ తనకే ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కోరారు. లేదంటే రెబెల్‌గానైనా పోటీ చేయడానికి సిద్ధమని చెప్పారు. ఆదివారం యూత్‌ ఇంటరాక్షన్‌ విత్‌ జీవీర్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2023-08-21T10:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising