ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన

ABN, First Publish Date - 2023-07-05T04:24:56+05:30

శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన చినికి చినికి గాలివానలా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి ..

మదీనా మసీదుపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌లో బంద్‌, ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితి.. మసీదుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

గజ్వేల్‌, జూలై 4: శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన చినికి చినికి గాలివానలా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో సోమవారం రాత్రి మూత్ర విసర్జన చేయడంతో హిందూ సంఘాలు అతడిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ తీసి, ముగించుకుని వస్తున్న ఇద్దరిపై పలువురు దుండగులు దాడికి దిగగా, సందీప్‌ తలకు గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగగా, సిద్దిపేట సీపీ శ్వేత ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి, మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైందవ సంఘాలన్నీ కలిపి శివాజీ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మార్కెట్‌ రోడ్డులోని మదీనా మసీదు వద్దకు చేరుకోగానే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు మసీదు పైకి జెండాలను విసరగా, మరికొందరు రాళ్లు రువ్వారు. గజ్వేల్‌ ఏసీపీ రమేశ్‌ అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా, మసీదులోని ముస్లింలు నినాదాలు చేయడంతో మరోసారి రాళ్లు రువ్వారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను ఇందిరాపార్కు చౌరస్తా వైపునకు మళ్లించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో మసీదు వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. సీపీ శ్వేత ఇరుపక్షాలను సముదాయించారు. మసీదుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులను అరెస్ట్‌ చేస్తామని సీపీ చెప్పారు. రాత్రంతా పికెటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూత్ర విసర్జన చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినట్లు శ్వేత వెల్లడించారు. గజ్వేల్‌లో పరిస్థితిపై కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రమేశ్‌నాయుడు సమీక్షించారు.

Updated Date - 2023-07-05T04:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising