ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో యువకుడి మోసం

ABN, First Publish Date - 2023-06-02T00:18:20+05:30

ప్రేమ పేరుతో యువతికి మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి.. అనంతరం ఆ యువతి మగబిడ్డకు జన్మనివ్వడంతో తనకేం సంబంధం లేదని ముఖం చాటేశాడు ఓ యువకుడు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతిని గర్భవతిని చేసి.. ముఖం చాటేసిన వైనం

నిందితుడిపై కేసు నమోదు

శంకర్‌పల్లి, జూన్‌ 1 : ప్రేమ పేరుతో యువతికి మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి.. అనంతరం ఆ యువతి మగబిడ్డకు జన్మనివ్వడంతో తనకేం సంబంధం లేదని ముఖం చాటేశాడు ఓ యువకుడు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహలింగాపురం గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు నారెగూడెం నర్సింహారెడ్డి ఇంట్లో నాలుగేళ్లుగా ఓ కుటుంబం అద్దెకుంటోంది. ఆ ఇంట్లో దంపతులకు కూతురు ఉండగా.. ప్రస్తుతం బీటెక్‌ చదువుతోంది. అయితే, నర్సింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి(22) ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ శారీరకంగా వాడుకున్నాడు. ఈక్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈక్రమంలో ఐదు రోజుల క్రితం యువతికి పురిటినొప్పులు రావడంతో తల్లిదండ్రులు మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు ఆపరేషన్‌ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. యువతి అసలు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్‌రెడ్డి పరారీలో ఉండగా నర్సింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-06-02T00:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising