గిరిజన నాయకుల అరెస్ట్
ABN, First Publish Date - 2023-03-13T23:43:43+05:30
వరంగల్‌లో మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తలపెట్టిన కలెక్టరేట్ ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పరిగి/కులకచర్ల, మార్చి 13: వరంగల్‌లో మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తలపెట్టిన కలెక్టరేట్ ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిగి నుంచి ఆందోళనకు బయల్దేరిన గిరిజన సంఘాల నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్, తాలుకా అధ్యక్షుడు జరుపుల శ్రీనివా్‌సనాయక్, లంబాడాల ఐక్యవేదిక జిల్లా ఇన్‌చార్జి రమేశ్ తదితరులను పరిగి పోలీసులు అరె్‌స్టచేసి స్టేషన్‌కు తరలిచారు. అదేవిధంగా కులకచర్ల పోలీసులు ముట్టడికి వెళ్తున్న ఐదుగురి గిరిజన నాయకులను అరెస్ట్ చేసి పీఎ్‌సకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచికతపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో గిరిజన నాయకులు గోపాల్‌నాయక్, జానక్‌రాం, గాంగ్యా, రవిలాల్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-03-13T23:43:43+05:30 IST