ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీని గెలిపించాలి : తల్లోజు ఆచారి

ABN, First Publish Date - 2023-11-13T23:41:47+05:30

కుటుంబ పార్టీలు, అసమర్థ నాయకులకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి పిలుపు నిచ్చారు.

ఆమనగల్లు : మాట్లాడుతున్న ఆచారి

ఆమనగల్లు/మాడ్గుల నవంబరు 13: కుటుంబ పార్టీలు, అసమర్థ నాయకులకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి పిలుపు నిచ్చారు. బీజేపీతోనే అవినీతి రహిత సుస్థిర పాలన సాద్యమని అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో సోమవారం ఆచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. ఆయా చోట్ల ప్రచారంలో ఆచారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఎన్నికల్లో బీజేపీ ని ఆదరించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మూడున్నర దశాబ్దాలుగా తాను ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఐదు సార్లు ఓడిపోయి ఆరో సారి బరిలో ఉన్న తనను ఆదరించి గెలిపిస్తే మీలో ఒక్కడిగా నడుచుకుంటానని తెలిపారు. తన బలం లేని తనకు జనమే నా బలమని అన్నారు. అవకాశ వాద పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అసమర్థత మూలంగానే అభివృద్ధిలో కల్వకుర్తి వెనుకబాటుకు గురైందని ఈ సారి వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి వస్తుందన్నారు. ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆచారి సమక్షంలో బీజేపీలో చేరారు. జిల్లా, మండలాల నాయకులు కండె హరిప్రసాద్‌, గోరటి నర్సింహ, రాంపాల్‌ నాయక్‌, దుర్గయ్య, వెంకట్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, మట్ట వెంకటేశ్‌, కాసుల వెంకటేశ్‌, పెద్దయ్య యాదవ్‌, దండు శ్రీను, లక్ష్మణ్‌ రావు, కండె సాయి, శ్రీకాంత్‌ సింగ్‌, శ్రీశైలం యాదవ్‌, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-13T23:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising