ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: భర్త, అత్తామామలు, ఆడపడుచు సూటిపోటి మాటలు తాళలేక ఆ నవవధువు..

ABN, First Publish Date - 2023-07-06T09:55:26+05:30

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు. భర్త, అత్తింటి వారి వేధింపులతో అలిసిపోయిన నవవధువు జీవితంపై విరక్తి చెంది తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. మైలార్‌దేవ్‌పల్లిలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక కవిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజులకే కంత్రీగాడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటిపోటి మాటలతో కవితను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. భర్త కుటుంబం వేధింపులు భరించలేక కవిత తనువు చాలించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై 304 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లై అత్తారింట్లో సుఖసంతోషాలతో ఉంటుందనుకున్న తమ బిడ్డ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2023-07-06T10:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising