క్రిస్మస్ వేడుకలకు చర్చీల ముస్తాబు
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:54 PM
క్రిస్మస్ వేడుకలకు ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి ,కడ్తాల మండలాల పరిధిలో చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రతి ఏటా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఆమనగల్లు, డిసెంబరు 24 : క్రిస్మస్ వేడుకలకు ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి ,కడ్తాల మండలాల పరిధిలో చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రతి ఏటా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం జరుపుకునే పండుగ కోసం ఇళ్లపై స్టార్లను ఏర్పాటు చేశారు. చర్చిలను కూడ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు గావించారు.
చేవెళ్ల : నేడు జరగనున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ తదితర మండలాల్లోని చర్చిలు ముస్తాబు చేశారు. పలు చర్చిలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆయా మండలాలోని ఆయా గ్రామాల్లో చేవెళ్ల, న్యాలట, దామరిగిద్ద, మరియాపురం, షాబాద్, కేశవగూడ, మద్దూర్, బోనగిరిపల్లి, రేగడిదోస్వాడతో పాటు మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లోని తదితర చర్చిలను క్రిస్‌మస్ కోసం అలంకరించారు.
మాడ్గుల : మండలంలోని కొత్తబ్రాహ్మణపల్లి గ్రామంలో నేడు నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు లూర్ధుమాత చర్చిని ముస్తాబు చేశారు. రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద చర్చిలలో బ్రాహ్మణపల్లి లూర్థుమాత చర్చి ఒకటి అని గ్రామస్తులు చెప్పారు.
కొత్తూర్ : క్రిస్‌మస్ వేడుకలను పురస్కరించుకుని మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో చర్చీలను సర్వాంగాసుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం నుంచే క్రిస్‌మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ మాత చర్చి, మండల పరిధిలోని రెడ్డిపాలెం చర్చిలను నిర్వహకులు విద్యుద్ధీపాలంకరణతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరుకాన్నుట్లు నిర్వహకులు తెలిపారు.
యాచారం : నేడు జరిగే క్రిస్మస్ వేడుకులకు మండలంలోని యాచా రం, కుర్మిద్ద, తాడిపర్తి, నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, తక్కళ్లపల్లితండాలోని సెయింట్ గ్రెగోరియస్ బాలాగ్రామ్ సంస్థ, గున్‌గల్, చిన్నతూండ్లలో చర్చిలను నిర్వాహకులు విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. సెయింట్ గ్రెగోరియస్ బాలాగ్రామ్ సంస్థలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు చెఆప్పరు.
Updated Date - Dec 24 , 2023 | 11:54 PM