అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ అండ

ABN, First Publish Date - 2023-01-25T00:23:05+05:30

ఆడపిల్లల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాన్ని కళ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ నిరుపేదలకు కల్యాణలక్ష్మితో భరోసా ఇస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ అండ
చేవెళ్లలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల/షాబాద్‌, జనవరి 24: ఆడపిల్లల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాన్ని కళ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ నిరుపేదలకు కల్యాణలక్ష్మితో భరోసా ఇస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం 50మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. అదేవిధంగా షాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో 21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాస్‌, సైదులుగౌడ్‌, చేవెళ్ల జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణారెడ్డి, చేవెళ్ల, షాబాద్‌ ఎంపీపీలు ఎం.విజయలక్ష్మీరమణారెడ్డి, కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీలు కర్నె శివప్రసాద్‌, జడల లక్ష్మీరాజేందర్‌గౌడ్‌, సర్పంచ్‌లు ఎం.మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ నర్సింగ్‌రావ్‌, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, జి.రవికాంత్‌రెడ్డి, యాదయ్యగౌడ్‌, బుర్ల సాయికుమార్‌, వెంకటేశ్‌, విజయ్‌, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising