ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

ABN, First Publish Date - 2023-08-05T23:46:05+05:30

వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

సమ్మేళనంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పాల్గొన్న నాయకులు

మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

చేవెళ్ల, ఆగస్టు 5: వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డితో కలిసి కేఎల్లార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎ్‌సకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజారంజక పాలన చేసే కాంగ్రె్‌సకు అధికారాన్ని అప్పగి ంచేందుకు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేసి కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించాయని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పలువురు నాయకులు ఆయనను కోరారు. సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు సున్నపు వసంతం, దర్శన్‌, వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, వీరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, చేవెళ్ల సర్పంచ్‌ శైలజ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-05T23:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising