ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సైబరాబాద్‌లో కల్తీ ముఠా గుట్టురట్టు... కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో..

ABN, First Publish Date - 2023-05-07T10:13:17+05:30

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్‌ను సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే గాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టులో అసిటిక్ యాసిడ్‌తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఈ కేటుగాళ్లు.. వెల్లుల్లి పాయల పొట్టును కూడా వదలని పరిస్థితి. మెషినరీలో కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును కూడా కలుపుతూ పేస్ట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

పరిశ్రమలో అపరిశుభ్రత, మురుగు నీటి వినియోగం, ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల చేత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వాహకుడు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు పరిశ్రమ నడుపుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్తీ దందా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అటు అధికారులు కూడా పరిశ్రమ యజమాని ఇచ్చే ముడుపులకు ఆశ పడి అటువైపు కెన్నెత్తి చూడని పరస్థితి. 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, భారీగా మ్యాంగో కూల్ డ్రింగ్, ప్రమాదకరమైన రసాయనాలు, మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, వన్ టన్ వెల్లుల్లిను సీజ్ చేసిన పోలీసులు... ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-05-07T10:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising